Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డేవిడ్ వార్నర్‌తో యాంకర్ సుమ.. స్టార్ మహిళ కప్పు అనుకున్నావా అక్క!
Recommended Video
తెలుగు యాంకర్ సుమకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది యువ యాంకర్స్ వస్తున్నా సుమ మాత్రం దూసుకుపోతోంది. బుల్లి తెరపై పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే పలు ఈవెంట్స్‌లో మెరుస్తోంది. తరచుగా సుమ వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తోంది. యాంకర్ సుమ తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో చేసిన ప్రకటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్వరలో ఐపీఎల్
ఇండియాలో సినిమాని ఎంతగా ఆదరిస్తారో క్రికెట్ ని కూడా అదేస్థాయిలో ఆదరిస్తారు. త్వరలో ఐపీఎల్ సందడి ప్రారంభం కాబోతోంది. దీనితో ఆయన ప్రాంచైజీలన్నీ తమ జట్లని ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ప్రియులకు పండగ వాతావరణం నెలకొన్నట్లే. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంజైజీ యాడ్ షూట్ జరిగింది. ఈ యాడ్ లో యాంకర్ సుమ కూడా పాల్గొంది.
డేవిడ్ వార్నర్‌తో సుమ
ఈ ఫొటోల్లో సుమ డేవిడ్ వార్నర్, ఇతర టీం సభ్యులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా సుమ, వార్నర్ ఫొటోకు నెటిజన్లు చాలా సరదాగా కామెంట్స్ పెడుతూ, మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో వార్నర్ తో పాటు భువనేశ్వర్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు.
స్టార్ మహిళ కప్పు
సుమ, డేవిడ్ వార్నర్ ఉన్న ఫొటోకు కొందరు తయారు చేసిన మీమ్ చాలా ఫన్నీగా ఉంది. ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ కప్పు మనకే రావాలి అన్నా అని సుమ అడుగుతున్నట్లు కామెంట్ పెట్టారు. దీనికి డేవిడ్ వార్నర్ సమాధానంగా.. ఇదేమైనా స్టార్ మహిళ కప్పు అనుకున్నావా అక్క అనే కామెంట్ చాలా సరదాగా ఉంది. మరో నెటిజన్ ఇది ఎస్ఆర్హెచ్ అభిమానులకు ఎమోషనల్ మూమెంట్.. మా అన్న.. మా అక్క అని కామెంట్ చేశాడు.
బుల్లి తెరపై
ఈ యాడ్ త్వరలో బుల్లి తెరపై ప్రసారం కానుంది. తెలుగులో సుమ పాపులర్ యాంకర్ కావడంతో ఈ యాడ్ కు ఆమెని ఎంపిక చేసుకున్నారు. మంచి వాక్చాతుర్యంతో సుమ సందర్బోచితంగా వ్యవహరిస్తుందనే గుర్తింపు ఉంది. ఇక క్రికెట్ పై అభిమానం చూపే హీరోలు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. విక్టరీ వెంకటేష్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే స్టేడియంలో ప్రత్యక్షమైపోతుంటాడు.