Acharya : రొటీన్ కి భిన్నంగా సుమ ప్రశ్నలు.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చిన చిరు, చరణ్, కొరటాల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతోంది. ఈ ఈవెంట్ కు రాజమౌలిలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సాధారణ శైలికి భిన్నంగా రామ్ చరణ్, చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ వేదిక మీద ఉండగా యాంకర్ సుమ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలు తాను స్వయంగా వారిని అడిగి వాటికి సమాధానాలు రాబట్టింది. ఇప్పుడు ఆ ప్రశ్నలు సమాధానాలు ఆసక్తికరంగా సాగాయి. ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారు, వాటికి ఆ ముగ్గురు ఎలా సమాధానం ఇచ్చారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మెగా పవర్ స్టార్ అయ్యారు

మెగా పవర్ స్టార్ అయ్యారు


తొలుత సుమన్ చిరంజీవిని ప్రశ్నిస్తూ ఇంట్లో వంటల్లో ది బెస్ట్ అంటే ఎవరు అని చెబుతారు అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చి మొదటి ఆప్షన్ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ, రెండో ఆప్షన్ ఆయన భార్య సురేఖ పేరు చెప్పగా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ తడుముకోకుండా తన భార్య సురేఖ కంటే తన తల్లి అద్భుతంగా వంట చేస్తారని తల్లికి మించి వంట చేసే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పుకొచ్చారు. తర్వాత రామ్ చరణ్ తేజను ప్రశ్నిస్తూ మీ ఇంట్లో మీకు ఎవరు ఆచార్య? పవన్ కళ్యాణ్ గారా? మెగాస్టార్ చిరంజీవి గారా? అని ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నా నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా, కానీ వాళ్ళ బాబాయ్ నుంచి అల్లరి నేర్చుకున్నాడు అని చెప్పుకొచ్చారు. దీంతో సుమ అందుకే ఆయన మెగా పవర్ స్టార్ అయ్యారు అంటూ కౌంటర్ ఇచ్చింది.

నటరాజు తర్వాతే ఎవరైనా

నటరాజు తర్వాతే ఎవరైనా


కొరటాల శివ ప్రశ్నిస్తూ మీకు ఎవరితో పనిచేయడం చాలా బాగా నచ్చింది ప్రొడ్యూసర్ రాంచరణ్ తోనా? లేక యాక్టర్ రామ్ చరణ్ తోనా? అని అడగగా పక్కనే ఉన్న రామ్ చరణ్ కల్పించుకుని నేను ఈ సినిమాకి పూర్తిగా నటుడిగానే వ్యవహరించాను. పేరుకు ఈ సినిమాకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే బ్యానర్ వేసాము కానీ పూర్తిగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అన్నీ నిరంజన్ రెడ్డి స్వయంగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఫ్యూచర్ లో మిమ్మల్ని నిర్మాత రామ్ చరణ్ గా చూడవచ్చా అంటే నా నటన నచ్చడం లేదా పూర్తిగా నిర్మాతగా మారి పోవాలని అంటున్నారా అంటూ రామ్ చరణ్ కౌంటర్ వేశారు.. దానికి సుమ ఎవరు ఈ ఇరకాటంలో పడేసిన ప్రశ్నలన్నీ నా చేత అడిగిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత కొరటాల శివతో మెగా స్టార్ చిరంజీవి బాగా డాన్స్ చేశారా లేక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాగా డాన్స్ చేశారా అని ప్రశ్నించగా మైక్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన పూర్తి పేరు శివశంకర వరప్రసాద్ అని పేరులోనే శివుడు ఉన్నాడు కాబట్టి డాన్స్ లో ఆ నటరాజు తర్వాతే ఎవరైనా అని చెప్పుకొచ్చారు.

 ఉపాసనకి భయపడతారా

ఉపాసనకి భయపడతారా


ఇదే విషయాన్ని కొరటాల శివ కూడా చెబుతూ తన పేరులో కూడా శివ ఉంది కాబట్టి ఆయన చెప్పింది నిజమేనని చెప్పుకొచ్చారు. ఇంతలో మెగాస్టార్ చిరంజీవి కల్పించుకుని వాళ్ళని కూడా ఒక్కోసారి ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఒక్కోసారి తగ్గుతామని, తద్వారా వాళ్ళు బాగా చేయడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. ఇక సినిమాకి ముఖ్యమైన వ్యక్తి ఎవరు హీరోనా? దర్శకుడా? అని అడిగితే ఖచ్చితంగా మరో మాట లేకుండా దర్శకుడు అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. దర్శకుడు లేనిదే సినిమా లేదని కాబట్టి దర్శకుడికే మొదటి తాంబూలం ఇవ్వాలని చిరంజీవి అన్నారు.. తర్వాత రామ్ చరణ్ ను ప్రశ్నిస్తూ మీరు మీ నాన్నగారు చిరంజీవి గారికి భయపడతారా లేక భార్య ఉపాసనకి భయపడతారా అని ప్రశ్నిస్తే నేను ఎవరికి భయపడతా అని చెప్పలేను కానీ మా అమ్మ గారి తో జాగ్రత్తగా ఉంటూ నాన్నగారు మాకు అదే విషయాన్ని నేర్పించారు కాబట్టి నేను ఉపాసనతో జాగ్రత్తగా ఉంటాను అని చెప్పుకొచ్చారు.

లీక్స్ చేస్తాను అని

లీక్స్ చేస్తాను అని


కళ్యాణ్ బాబాయ్ కైనా మా నాన్నగారికి అయినా మాకు అయినా మా అమ్మగారు అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇష్టమా లేక ఆచార్య, సిద్ద ఇష్టమంటే మరో మాట లేకుండా ఆచార్య సిద్ధ ఇష్టమని కొరటాల శివ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని మీకు ఆచార్య పాత్ర ఇష్టమా సిద్ధ పాత్ర ఇష్టమా అని అడిగితే తనకు ఓపెన్ ఆఫర్ ఇస్తే కనుక సిద్ధ పాత్ర మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు. ఆ పాత్ర ద్వారా అనేక వేరియేషన్స్ చూపించే అవకాశం ఉందని చెబుతూనే మళ్లీ మధ్యలో ఆగిపోయి మొత్తం కధ చెప్పేస్తాను ఏమో అంటూ వెనకడుగు వేశారు. ఇక దాన్ని బేస్ చేసుకుని సుమ మరో ప్రశ్న అడిగింది మీకు కరోనా కారణంగా ఇంట్లో ఉండాల్సి వస్తుందని భయమా లేక ఇలా ఈవెంట్లలో లీక్స్ చేస్తాను అని భయమా అంటే, దానికి చిరంజీవి లీక్ చేస్తాను అని భయం అన్నట్టు చెప్పుకొచ్చారు.

 సుమతోనే స్టెప్పులు

సుమతోనే స్టెప్పులు


ఇక ఆ తర్వాత మీకు నాటుకోడి ఇష్టమా చేపల పులుసు ఇష్టమా అని చిరంజీవి గారిని అడగగా చేపల పులుసు ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ తేజను మీకు మెగా పవర్ స్టార్ అనిపించుకోవడం ఇష్టమా లేక సన్ ఆఫ్ మెగా స్టార్ అనిపించుకోవడం ఇష్టమా అంటే మెగాస్టార్ పవర్ స్టార్ కలిసి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అనిపించుకోవడం ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొరటాల శివ లాహే లాహే సాంగ్ పర్ఫామెన్స్ చేస్తారా లేక భలే భలే బంజారా సాంగ్ కి పర్ఫామెన్స్ చేస్తారా అని అంటే నేను చేస్తే బాగుండదని కొరటాల శివ అన్నారు ఆ తర్వాత సుమతోనే స్టెప్పులు వేయించారు మెగాస్టార్ చిరంజీవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X