వృద్ధ దంపతుల పరిస్థితి చూసి చలించి పోయిన యాంకర్ సుమ, ఏం చేసిందో తెలుసా?
టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల టీవీ షోలు, ఆడియో ఫంక్షన్ల హడావుడితో ఎప్పుడూ బిజీగా గడుపుతుంటారు. క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్న సుమ... తన సంపాదలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు.
గతంలో కేరళ తుఫాను బాధితులకు తన వంతు సహాయం అంధించిన ఈ పాపులర్ యాంకర్... తాజాగా తిత్లీ తుఫాన్ కారణంగా కష్టపోయిన వారికి హెల్ప్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇల్లు కోల్పోయిన ఒక వృద్ద జంటకు ఆమె ఇల్లు కట్టిస్తున్నారు.
స్వయంగా పర్యవేక్షిస్తున్న సుమ
ఇంటి నిర్మాణానికి సహాయం చేయడమే కాదు.... ఆ పనులను సర్వయంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే వారి ఇల్లు పూర్తి కాబోతోంది అంటూ సుమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

డ్రైవర్ విషయం చెప్పగానే చలించి పోయింది
తన వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి ద్వారా వృద్ధ దంపతుల గురించి తెలుసుకున్న సుమ చలించి పోయారు. వెంటనే వారి ఇల్లు నిర్మాణానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వీరితో పాటు మరికొంత మంది తుఫాను బాధితులకు సుమ హెల్ప్ చేశారట.

ప్రశంసల వర్షం
సుమ చేస్తున్న సహాయాన్ని పలువురు నెటిజన్లు అభినందించారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

వరుస షోలతో బిజీ బిజీ
ప్రస్తుతం సుమ వరుస టీవీ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. స్టార్ మహిళ కార్యక్రమానికి ముగింపు పలికిన అనంతరం ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు' అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ షోకు అంతగా ఆదరణ లభించలేదు.


Click it and Unblock the Notifications











