మై గుండు బోయ్.... రొమాంటిక్ ఫోటో పోస్టు చేసిన యాంకర్ సుమ!
పాపులర్ తెలుగు యాంకర్ సుమ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. తన భర్త రాజీవ్ కనకాలతో దిగిన ఈ ఫోటోలో ఇద్దరూ ఎంతో రొమాంటిక్‌గా కనిపించారు. అంతకంటే ముఖ్యంగా ఆమె ఈ ఫోటోకు పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ నేను మా వారిని ఇలా గుండుతో చూస్తున్నాను... మై గుండు బోయ్ అంటూ తన భర్తను ముద్దుగా పిలచుకుంటోంది. ఈ ఇద్దరి పెళ్లయి దాదాపు 20 సంవత్సరాలు కావస్తోంది. ఇన్నేళ్ల కాలంలో రాజీవ్ ఒక్కసారి కూడా గుండు చేయించుకోలేదంటే విచిత్రమేమరి!
రాజీవ్, సుమ ప్రేమ వివాహం
దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్‌లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో సుమకు పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త అంటే చాలా ప్రేమ... అభిమానులు తప్పుగా పిలిస్తే
ఇద్దరూ సెలబ్రిటీలే కావడంతో అప్పుడప్పుడు వీరికి అభిమానులతో చాట్ చేసేపుడు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. అక్క మీరు రాజీవ్ అన్నయ్యతో ఓ సినిమా చేస్తే బావుంటుంది... అని ఓ అభిమాని గతంలో ప్రశ్న వేయగా దీనిపై సుమ ఆసక్తికరంగా స్పందించారు. ఏమిటా వరసలు? ముందు వరసలు మార్చు... పిలిస్తే నన్ను వదినా అని పిలవండి, ఆయన్ను అన్నయ్య అనండి. లేదంటే నన్ను అక్క అనండి, ఆయన్ను బావా అనండి అని సూచించారు. ఆయనతో మూవీ చేస్తే చూడాలని ఉందా? ఈ విషయం రాజీవ్‌ను అడిగి చెబుతాను అని సుమ వ్యాఖ్యానించారు.

తెలుగులో టాప్ యాంకర్
తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో సుమ టాప్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె మాతృభాష తెలుగు కాక పోయినా.... తెలుగులో అనర్గళంగా మాట్లాడటం సుమ ప్రత్యేకత. అందుకే ఆమె ఇక్కడ తిరుగులేని యాంకర్‌గా ఎదిగారు.

వరుస షోలతో బిజీ బిజీ
ప్రస్తుతం సుమ వరుస టీవీ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. స్టార్ మహిళ కార్యక్రమానికి ముగింపు పలికిన అనంతరం ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు' అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు ఆమె చాలా కార్యక్రమాలను హోస్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











