యూఎస్ఏ సెక్స్ రాకెట్, కాస్టింగ్ కౌచ్‌ ఇష్యూపై రియాక్ట్ అయిన యాంకర్ శ్యామల!

By Bojja Kumar

Recommended Video

బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : కాస్టింగ్ కౌచ్ పై శ్యామల స్పందన

బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత టీవీ ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన యాంకర్ శ్యామలకు యూఎస్ఏ సెక్స్ రాకెట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. టాలీవుడ్ సెలబ్రిటీలను యూఎస్ఏలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అని పిలిచి, వారికి ఇష్టం లేకున్నా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు అని ఓ హీరోయిన్ కంప్లయింట్ చేసింది. మీరు కూడా గతంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. మీకేమైనా అలాంటి సంఘటనలు ఎదురయ్యాయా? ఎవరైనా అలాంటి ఫోన్లు చేశారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నలపై శ్యామల స్పందించారు.

అలాంటి ఫోన్లు ఎప్పుడైనా వచ్చాయా?

అలాంటి ఫోన్లు ఎప్పుడైనా వచ్చాయా?

నేను అమెరికా వెళ్లినపుడు ఫోన్ వాడను. లోకల్ నెంబర్స్ కూడా తీసుకోను. నాకైతే అలాంటి ఫోన్లు ఎప్పుడూ రాలేదు. నేను వెళ్లినవి అన్నీ కూడా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్. అలాంటి ఆర్గనైజేషన్స్‌లో ఎవరైనా తేడాగా బిహేవ్ చేశారంటే కఠిన చర్యలు తీసుకుంటారు. ఒకరకమైన ఆ భయం ఉంటుంది కాబట్టి ఎవరూ అలా చేయరు. ఎలా తీసుకొచ్చామో అంతే జాగ్రత్తగా పంపించే ప్రయత్నం చేస్తారు.

 ఎప్పుడు హోటల్‌లో ఉండలేదు...

ఎప్పుడు హోటల్‌లో ఉండలేదు...

మాది చాలా పెద్ద ఫ్యామిలీ. యూఎస్ఏలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అక్కడే సెటిలైన మా చుట్టాలు ఉన్నారు. ఎప్పుడు అమెరికా వెళ్లినా హోటల్స్‌లో స్టే చేయలేదు. నేను వెళ్లింది, ఉన్నది అంతా కూడా చుట్టాల ఇంట్లోనే ఉన్నాను.

 నావన్నీ వెరీ సెక్యూర్డ్, హ్యాపీ ట్రిప్స్

నావన్నీ వెరీ సెక్యూర్డ్, హ్యాపీ ట్రిప్స్

ఒకసారి ఈటీవీ వారితో వెళ్లినపుడు హోటల్‌లో ఉన్నాను. అపుడు ఈటీవీ క్రూ మొత్తం హోటల్‌లో ఉంది. ఈటీవీ క్రూతో హోటల్‌లో ఉంటే గవర్నమెంట్ హాస్టల్‌లా ఉంటుంది. షాపింగ్ వెళదామన్నా మీతో పాటు మేము కూడా తోడుగా వస్తాము అనే టైపు. నావన్నీ వెరీ సెక్యూర్డ్, హ్యాపీ ట్రిప్స్. నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు.

నాకు ఈ విషయం కూడా తెలియదు

నాకు ఈ విషయం కూడా తెలియదు

మీకంటే చుట్టాలు ఉన్నారు, ఒక సెక్యూర్డ్ జోన్లో ఉన్నారు. మిగతా వారికి అలా జరిగింది అనేది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఎవరైనా ఇలాంటి విషయాలు మీతో మాట్లాడారా? అనే ప్రశ్నపై శ్యామల స్పందిస్తూ.... మనం ఒక టీమ్‌తో ఉంటే ఇలాంటి మాట్లాడుకుంటాం. కానీ నేను వెళ్లి ఈవెంట్ చేసిన తర్వాత మా బ్రదర్ వాళ్లు, పెద్దమ్మవాళ్లు, వదినవాళ్ల చుట్టాలు ఇంటికెళ్లిపోయి నా షాపింగ్, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండేదాన్ని. ఇప్పటి వరకు అలాంటివి నా దృష్టికి కాలేదు. ఇపుడు మీరు చెప్పే వరకు నాకు ఈ విషయం కూడా తెలియదు.

కిషన్ మోదుగుమూడి పేరు ఎప్పుడైనా విన్నారా?

కిషన్ మోదుగుమూడి పేరు ఎప్పుడైనా విన్నారా?

కిషన్ మోదుగుమూడి, అతడి భార్య పేరు ఈ సెక్స్ రాకెట్లో ప్రధానంగా వినిపిస్తోంది. వాళ్ల పేర్లు ఎప్పుడైనా విన్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా పలానా వ్యక్తి ఇలా ఫోన్ చేశారు? ఇలా మాట్లాడుతున్నారని చెప్పారా? అనే ప్రశ్నకు శ్యామల స్పందిస్తూ అలాంటివేమీ నా దృష్టికి రాలేదని తేల్చి చెప్పారు.

 నేను యూఎస్ఏకు ఫ్రీక్వెంట్ విజిటర్ కాదు

నేను యూఎస్ఏకు ఫ్రీక్వెంట్ విజిటర్ కాదు

నాకు అమెరికాలో ఏదైనా షోలు చేసే అవకాశం వస్తే ఆర్గనైజేషన్ గురించి ముందు కనుక్కుంటాను. అక్కడ లోకల్‌గా ఉండే మా వాళ్లతో ఎంక్వయిరీ చేసుకున్న తర్వాతే నేను షోలు చేయడానికి వెళతాను. అదే సమయంలో నేను ఫ్రీక్వెంట్ విజిటర్ కాదు. సంవత్సరంలో ఉగాది సమయంలో మాత్రమే వెళతాను. మూడు షోలు చేసుకుని వచ్చేస్తాను. అది కూడా చుట్టాల ఇళ్లలో ఉంటాను. ఫ్రీక్వెంటుగా వెళ్లే వారికి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా తెలుస్తుందేమో? నాకైతే అలాంటివి తెలియవు.

నా బౌండరీ దాటి అలాంటి సమస్యలు రాలేదు

నా బౌండరీ దాటి అలాంటి సమస్యలు రాలేదు

సినిమాల్లో, టీవీల్లో చేసే వారిపై ప్రజల్లో ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అలాంటిది ఇపుడు కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్‌తో టాలీవుడ్ వారికి లింక్స్ ఉన్నాయని ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఒకసారి ఇలాంటి న్యూస్ వస్తే వీటి ఇంపాక్ట్ అందరిపైనా ఉంటుంది. దీని వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అనే ప్రశ్నకు శ్యామల స్పందిస్తూ... దేవుడి దయవల్ల నా బౌండరీ దాటి నా వద్దకు అలాంటి సమస్యలు రాలేదు. అది రాదు అని అనుకుంటున్నాను అని శ్యామల తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X