ఆనందహేల: యాంకర్ శ్యామల బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్లు, పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ల ప్రాముఖ్యత పెరిగి పోయింది. తెలుగు తెరపై యాంకర్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఝాన్సీ, సుమ, అనసూయ లాంటి వారు ఉన్నారు. తాజాగా మరో యాంకర్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, ఆకట్టుకునే అందం, నిర్మాలమైన ముఖారవిందం ఆమె సొంతం. ఆమె మరెవరో కాదు టీవీ యాంకర్ శ్యామల. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల ఆ తర్వాత కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది.
ఈ క్రమంలో పలు టాలీవుడ్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు యాంకర్ చేస్తూ అందరి దృష్టిలో పడింది. దీంతో పలువురు దర్శకులు ఆమెలోని యాక్టింగ్ స్కిల్స్, అందం చూసి తమ సినిమాల్లో అవకాశాలు కూడా ఇచ్చారు. ఆమధ్య విడుదలై గోపీచంద్ ‘లౌక్యం', నాగ చైతన్య ‘ఒక లైలా కోసం' చిత్రంల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది.
ఇటీవల శ్యామల తన పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, స్నేహుతుల మధ్య జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు తన అభిమానుల కోసం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

హ్యాపీ బర్త్ డే
హ్యాపీ బర్త్ డే యాంకర్ శ్యామల.

భర్తతోకలిసి..
పుట్టినరోజు వేడుకల్లో భర్తతో కలిసి యాంకర్ శ్యామల.

హ్యాపీ మూమెంట్స్
పుట్టినరోజు సందర్భంగా శ్యామల ఎంతో సంతోషంగా గడిపింది.

ఫ్రెండ్స్
శ్యామల పుట్టినరోజు వేడుకల్లో ఫ్రెండ్స్..

స్నేహితురాళ్లు
శ్యామల పుట్టినరోజు వేడుకల్లో స్నేహితురాళ్లు

పుట్టినరోజు
శ్యామల పుట్టినరోజు వేడుక ఇటీవల ఆమె నివాసంలో జరుపుకుంది.


Click it and Unblock the Notifications











