twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుక్కలు అలాగే మొరుగుతాయ్: భర్త గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఉదయభాను!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యాంకర్ ఉదయభాను.... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. యాంకర్ గా, టీవీ ప్రజెంటర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడింది. ఎన్నో బాధలు, అవమానాలు భరించింది. తరచూ ఆమె గురించి కొన్ని వెబ్ సైట్లలో వినిపించే రూమర్స్ వినే మనకే ఎంతో బాధకగిస్తుంటాయి. మరి వాటికి ఉదయభాను ఎంత ఇంకెంత బాధ పడి ఉంటుంది.

    ప్రేమించిన వాన్ని పెళ్లి చేసుకున్న ఉదయభాను త్వరలో తల్లికాబాతోంది. ఈ నేపథ్యంలో ఆమె సాక్షి పత్రికకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ డిజి భవానితో తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించిన చాలా విషయాలు పంచుకున్నారు.

    ముఖ్యంగా తనపై ఇండస్ట్రీలో వినిపించిన రూమర్ల విషయంలో ఆమె చాలా ఘాటు స్పందించారు. ఇంత కాలం ఎన్ని కష్టాలు పడ్డా తల్లికాబోతున్నాననే ఆనందంతో అవన్నీ మరిచిపోయానని ఉదయభాను చెప్పుకొచ్చారు. త్వరలో కవలపిల్లలకు జన్మనివ్వబోతున్నానని, మరో వారం, పది రోజుల్లో మా ఇంట్లోకి ఇద్దరు పిల్లలు రాబోతున్నారని ఉదయభాను సంతోషంగా చెప్పింది.

    బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్ బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్

    తనపై వచ్చిన రూమర్ల గురించి స్పందిస్తూ.... మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతలివాళ్లు మాట్లాడేవి పట్టించుకోకపోతేనే బతకగలుగుతాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారేమో. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఈ ఫీల్డ్‌లో ఏ అమ్మాయి లైఫ్ అయినా ఒక గ్లాస్ హౌస్‌లో ఉన్నట్లుగా ఉంటుంది. దాని మీద ఎవరైనా రాయి వేయొచ్చు. అది తగలకుండా జాగ్రత్తపడాలి. తగిలి నా ఎదుర్కొని, యుద్ధం చేయగల సాహసం ఉండాలి అన్నారు.

    ఈ ఫీల్డ్‌లో అడ్వాంటేజ్, డిస్ అడ్వాంటేజ్ రెండూ ఉంటాయి. ఇక్కడికి రావడం ఒక రకంగా శాపం, ఒక రకంగా వరం. రూమర్స్, మనీ, ఫేమ్ అన్నీ వస్తాయి. ఏదేమైనా సక్సెస్‌లో ఉన్నవాళ్లను చూస్తే, ఏదో ఒక రాయి విసరకుండా ఉండలేరు చాలామంది. బట్ ఐ డోంట్ కేర్ దట్. గుళ్లో దేవతను చూసి వీధిలో కుక్కలు మొరుగుతూ ఉంటాయ్, దానివల్ల దేవత గొప్పతనం పడిపోదని నా ఫ్రెండ్ అమ్ములు అంటుంది. అది కచ్చితంగా నిజం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. నేను చిన్న వయసులోనే రావడం వల్ల చాలా చూశా. ఎన్నో జీవిత పాఠాలు నేర్చేసుకున్నా. అందుకే ఆడపిల్లలు పుడితే చాలా చాలా స్ట్రాంగ్‌గా పెంచాలనుకుంటున్నా అని ఉదయభాను తెలిపారు.

    మత్తెక్కించే టాలీవుడ్ హాటెస్ట్ ఐటం గర్ల్స్.. మత్తెక్కించే టాలీవుడ్ హాటెస్ట్ ఐటం గర్ల్స్..

    తన భర్త గురించి మాట్లాడుతూ...ఐయామ్ లక్కీ ఇనఫ్. నాకు కావల్సినంత ప్రేమ విజ్జూ (భర్త విజయ్) నుంచి దక్కింది. ఒక్కటి కచ్చితంగా చెప్పగలను. ప్రపంచమంతా ఒక్కటై నావైపు వేలెత్తి చూపిస్తున్నా.. ఆ వేలుని విరిచి నా వెన్నంటే ఉండే భర్త దొరికాడు అని ఉదయభాను తెలిపారు.

    ఈ ఇంటర్వ్యూలో ఉదయభానుతో పాటు ఆమె భర్త విజయ్ కుడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన గురించి పరిచయం చేసుకుంటూ....మాది విజయవాడ. మాకు థియేటర్లున్నాయి. విజయవాడలోనే భానూతో పరిచయం. మా ఇంట్లోవాళ్లకి కూడా తనంటే చాలా ఇష్టం. ఎంబీఏ ఇక్కడే హైదరాబాద్‌లో చేశా. మా పెళ్లయినప్పుడు నేను చదువుకుంటున్నాను. మా ఇంట్లో చెప్పి, పెళ్లి చేసుకోలేదని బాధపడ్డారు. అప్పటి పరిస్థితి అది. ఆర్య సమాజ్‌లో చేసుకున్నాం. పది రోజులకి అదే సర్దుకుంది అన్నారు.

    నాది కన్‌స్ట్రక్షన్ బిజినెస్. ఈ మధ్యే నాలుగైదు అపార్ట్‌మెంట్స్ కంప్లీట్ చేశాం. ప్రొఫెషనల్‌గా ఇద్దరం బిజీ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే తను వర్క్ చేయకూడదనుకున్నా ను. మామూలుగా నాలుగైదు నెలలు చేయొచ్చంటారు కానీ, ఏ ఒత్తిడీ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉంటే బాగుంటుందనిపించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం లైఫ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు మాకిద్దరు రాబోతున్నారు. వెరీ వెరీ హ్యాపీ అని విజయ్ తెలిపారు.

    ఇంత లేటుగా పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి కారణం..

    ఇంత లేటుగా పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి కారణం..

    భార్యాభర్తలుగా మేం ఫైనాన్షియల్‌గా జీరోతో స్టార్ట్ అయ్యాం. సెటిల్ కావడానికి టైమ్ పట్టింది. రెండేళ్ల క్రితం పిల్లలు ప్లాన్ చేద్దామని విజ్జూ అన్నాడు. ప్లాన్ చేసేశామని ఉదయభాను తెలిపారు.

    అందుకే కవలలేమో?

    అందుకే కవలలేమో?

    కవలలు అని డాక్టర్ చెప్పగానే కన్నీళ్లు ఆగలేదనుకోండి. రాముడు సీత ఫోటోలు చూసినప్పుడల్లా 'మీకు ఇద్దరు బిడ్డలు కదా.. నాకూ ఇద్దర్ని ఇవ్వండి' అని కోరుకునేదాన్ని. నా చిన్నప్పుడు జంట అరటిపండ్లు, జంట టమోటాలు, జంట వంకాయలు తింటే కవల పిల్లలు పుడతారని అనేవాళ్లు. నేను కావాలని అవే తినేదాన్ని. నేను కవలల్ని కోరుకున్న ప్రతిసారీ ఆ దేవతలు 'తథాస్తు' అని ఆశీర్వదించారేమో అనిపిస్తోంది అని ఉదయభాను తెలిపారు.

    ఫ్రాక్చర్ అయినా..

    ఫ్రాక్చర్ అయినా..

    మెల్లిగా నడవడం అనేది నా హిస్టరీలో లేదు. ఇద్దర్ని మోస్తున్నాను కాబట్టి మెల్లిగా నడవక తప్పడం లేదు. గంటలు తరబడి నిలబడి యాంకరింగ్ చేస్తాను కాబట్టి, గతేడాది రైట్ లెగ్ లిగమెంట్ టియర్ అయింది. కొద్ది రోజుల తర్వాత మెట్లు దిగుతుంటే పడిపోయాను. ఎడమ కాలికి ఫ్రాక్చర్ అయింది. అయినా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేశాను.

    మా గురించి నెగెటివే తప్ప పాజిటివ్ మాట్లాడరు

    మా గురించి నెగెటివే తప్ప పాజిటివ్ మాట్లాడరు

    నా గురించి ఏదేదో పిచ్చి పిచ్చిగా రాసేస్తా ఉంటారు కొందరు. మంచి రాయడానికి కదిలే కలాలు తక్కువ. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడేవాళ్లు ఉండరు. రెండు కాళ్లకూ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా షోలు చేశాను. చాలామందికి నా పరిస్థితి తెలుసు. అదే హీరోకో, హీరోయిన్‌కో చిటికెన వేలికి దెబ్బ తగిలినా రాస్తారు. నాలాంటి వాళ్ల గురించైతే నెగిటివ్ విషయాలు తప్ప పాజిటివ్‌గా మాట్లాడరు అని ఉదయభాను తెలిపారు.

    నాకోసం నేను ఆలోచించుకోలేనం బిజీ

    నాకోసం నేను ఆలోచించుకోలేనం బిజీ

    నాకోసం నేను ఆలోచించుకోలేనంత బిజీగా ఉండేదాన్ని. నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు కెరీర్ మొదలైంది. యాంకర్‌గా కాస్ట్యూమ్స్ చూసుకోవడం, మేకప్ చేసుకోవడం, చుట్టూ ఉన్న 'స్టుపిడిటీకి' ఆన్సర్ చేయడంతోనే సరిపోయింది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేయాలి. దాంతో బాగా సంపాదిస్తున్నా ఐదు వేళ్లతో కడుపు నిండుగా తిన్న సందర్భాలు తక్కువ. ఇప్పుడు నా కోసం, నా ఇద్దరి బిడ్డల కోసం ఫుల్లుగా లాగిస్తున్నా. నో టెన్షన్. పీస్‌ఫుల్‌గా అనిపిస్తోంది. ఇంకో వారం, పది రోజుల్లోపే నా బిడ్డలు వచ్చేస్తారు. 'అయామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే' అని ఉదయభాను తెలిపారు.

    ఈ ఫీల్డ్ లోకి ...

    ఈ ఫీల్డ్ లోకి ...

    నా చిన్నప్పుడే మా అమ్మ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించారు. స్టేజి షోలు చేశాను. వాటి ద్వారా అవకాశాలు వచ్చాయి. 'ఎర్ర సైన్యం' నా మొదటి సినిమా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశా. ఎక్కువగా టీవీపై దృష్టి పెట్టాను. పల్లెటూరి నుంచి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చా. ప్రాంతాల వివక్ష, కుల వ్యవస్థ అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు కావల్సినంత తీరిక దొరికింది కాబట్టి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయ్. 'ఇన్ని కష్టాలు పడ్డామా?' అనిపిస్తోంది అన్నారు.

    ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేసే సంస్కారం పెరగాలి

    ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేసే సంస్కారం పెరగాలి

    ఎంటర్టెన్మెంట్ రంగంలో ఉండే మహిళలకు చాలా కష్టాలు ఉంటాయి. పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు వెకిలి శబ్దాలు చేస్తారు. మీద పడటానికి ట్రై చేస్తారు. చదువుకున్నవాళ్లకు సంస్కారం ఉంటుందంటారు. కానీ, చాలా చోట్ల ఆ మాట తప్పని పిస్తుంది. ఫ్లైట్‌లో అమ్మాయి కనిపిస్తే ఎగాదిగా చూస్తుంటారు. ఒక్కోసారి నేను తట్టుకోలేక, 'కొంచెం తల తిప్పుకోవయ్యా' అన్న సందర్భాలు న్నాయి. బాధగా ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి? ఏ ఆడపిల్లనైనా రెస్పెక్ట్ చేసే సంస్కారం పెరగాలి. అది తక్కువ మందికి ఉంది అన్నారు.

    ఆకలి, ఆర్థిక కష్టాలపై

    ఆకలి, ఆర్థిక కష్టాలపై

    మా నాన్నగారిది చాలా పెద్ద కుటుంబం. జమిందార్లు. నా నాలుగేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. అప్పుడు నాన్న ఆస్తిలో అమ్మ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు. లక్షలు లక్షలు తీసుకుని ఎవరైనా మోసం చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసు అన్నారు.

    మనల్ని చూసి ఒకటే ఏడుపు

    మనల్ని చూసి ఒకటే ఏడుపు

    ఎవరైనా కష్టం అంటే వెంటనే సహాయం చేయాలనిపిస్తుంది. అనాథ పిల్లలకు పదివేలిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు, సొంతవాళ్లకి మీరేమైనా ఇవ్వండి అది ఉండదు. మనం ఎదుగుతుంటే ఒకటే ఏడుపు. ఈ మధ్య ఓ అమ్మాయికి చిన్న సాయం చేశాను. తను అన్న మాటలు ఎప్పటికీ మరచిపోలేను. హెల్ప్ చేసినందుకు జీవితాంతం విశ్వాసంగా ఉండమని కాదు.. మన ఎదుగుదల చూసి, వాళ్లు ఆనందపడితే అప్పుడు మనకూ హ్యాపీగా ఉంటుంది కదా.... అని ఉదయభాను అన్నారు.

    ఐటం సాంగులు

    ఐటం సాంగులు

    శేఖర్ కమ్ముల లీడర్ సినిమాకు అడిగారు. బేసిక్‌గా నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి, ట్యూన్ నచ్చి ఐటం సాంగ్ చేశాను. ఆ పాట తర్వాత దాదాపు 25 ఐటమ్ సాంగ్స్‌కి అవకాశం వచ్చింది కానీ, చేయలేదు. 'జులాయి'లో చేశాను. అన్నారు

    ఆడ, మగ ఎవరైనా

    ఆడ, మగ ఎవరైనా

    నాకూ, విజ్జూకి ఎవరైనా ఓకే. 'ఇప్పటికే ఇల్లంతా నీ బట్టలు, నీ నగలు.. నాకు ఒక్క కబోర్డ్ ఇచ్చావ్. ఇక, ఇద్దరు ఆడపిల్లలు పుడితే వాళ్ల బట్టలు, నగలు... నాకు ఆ కబోర్డ్ కూడా ఉండదు' అని నవ్వుతాడు.

    కొన్ని నెలలు బ్రేక్

    కొన్ని నెలలు బ్రేక్

    కొన్ని నెలలు బ్రేక్ తీసుకుని, మళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తాను. నేను, విజ్జూ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేశాం. ఈలోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో పక్కన పెట్టాం.

    English summary
    Anchor Udaya Bhanu reveal about her personal and professional life details in Sakshi Family interview with DG Bahavani. Udaya Bhanu is an Indian presenter and film actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X