పేరు మార్చుకున్న తెలుగు యాంకర్, అతడితో విడిపోయిందా? హాట్ ఫోజులతో రచ్చ!
Recommended Video

ఒకప్పుడు వెండి తెర భామలు మాత్రమే అందాల ఆరబోతతో అభిమానులకు కైపెక్కించేవారు. అయితే ఈ గ్లామర్ సాంప్రదాయం క్రమక్రమంగా వెండితెరకూ పాకింది. తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ అనసూయ, రష్మి ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు గ్లామర్ సొగబులు అదుతున్నారు. ఇపుడు వీరి దారిలో ప్రాయాణిస్తూ తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ వర్షిణి. అనసూయ, రష్మి మాదిరిగానే సోషల్ మీడియాలో అందాల సంచలనంగా మారింది.

వర్షిణి సౌందరాజన్
తెలుగులో సూపర్ హిట్ డాన్స్ ఫ్రోగ్రామ్ ఢీ-10కు వర్షిణి సౌందరాజన్ కో-యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ బ్యూటీ తెలుగు బుల్లి తెరకు కొత్త అనుకుంటున్నారు. కానీ ఈ హాట్ లేడీ బ్యాగ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్.

అసలు పేరు వేరు.... అంతకు ముందు సినిమాల్లో
యాంకర్ వర్షిణిగా ఇపుడు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె....... అంతకు ముందు వెండి తెరపై పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ‘చందమామ కథలు', ‘బెస్ట్ యాక్టర్స్'తో పాటు పలు చిత్రాల్లో శామిలి సౌందరాజన్ పేరుతో నటించారు.

మోడలింగ్ రంగం నుండి...
ఈ బ్యూటీ తొలుత హైదరాబాద్‌లో మోడలింగ్ చేసింది, అందంతో పాటు నటించే టాలెంట్ కూడా ఉండటంతో సినిమాల వైపు అడుగులు వేసింది. ‘చందమామ కథలు', ‘బెస్ట్ యాక్టర్స్' పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది.

దర్శకుడితో లవ్ ఎఫైర్, కానీ ఇపుడు సింగిల్
‘బెస్ట్ యాక్టర్స్' సినిమా దర్శకుడు అరుణ్ పవార్‌తో శామిలి ప్రేమలో పడింది. 2015లో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ఈ జంట ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లకముందే విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా స్టేటస్ సింగిల్ అని ఉండటాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు.

పేరు ఎందుకు మార్చుకుందో?
శామిలి సౌందరాజన్‌గా సినీ రంగానికి పరిచయం అయి ఈ బ్యూటీ.....అక్కడ సరైన అవకాశాలు లేక పోవడంతో బుల్లితెర వైపు టర్న్ అయ్యారు. వర్షిణిగా పేరు మార్చుకున్నారు. బహుషా ఆ పేరు తనకు కలిసి రాలేదని ఇలా చేసిందేమో?

రష్మి, అనూయ బాటలో హాట్ హాట్
రష్మి, అనసూయ బాటలోనే వర్షిణి కూడా హాట్ ఫోజులతో అభిమానులను టెమ్ట్ చేస్తోంది. క్రమం తప్పకుండా తన యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.

సోషల్ మీడియాలో రచ్చ..
సోషల్ మీడియాలో వర్షిణి చేస్తున్న అందాల రచ్చ చూస్తుంటే....... తెలుగు బుల్లితెరకు మరో గ్లామరస్ యాంకర్ దొరికిందని చర్చించుకుంటున్నారు.

మలేషియా ట్రిప్ ఫోటోస్ యమా హాట్
ఇటీవల వర్షిణి మలేషియా ట్రిప్ వెళ్లింది. ఈ సందర్భంగా బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











