అల్లు అర్జున్ కోసం సాక్రిఫైస్ చేసిన ఇలియానా...!
శక్తి, నేను నా రాక్షసి వంటి పరాజయాల తర్వాత ఇలియానాకి ఇక తెలుగులో అవకాశాలు రావనే అనుకున్నారు. ముఖ్యంగా శక్తి చిత్రం విషయంలో ఎన్టీఆర్, అశ్వనీదత్ లతో వైరం పెట్టుకున్న ఇలియానాని అందరూ దూరంగా పెడతారని భావించారు. కానీ మెగా హీరో అల్లు అర్జున్ మాత్రం ఆమెతో తొలిసారిగా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే చిత్రంలో కథానాయిక పాత్ర కోసం పలువురి పేర్లు పరిశీలించినా కానీ చివరకు ఇలియానానే ఖరారు చేసుకున్నారు.
తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో శంకర్ సినిమాతో, హిందీలో బర్ఫీతో ఇంకా డిమాండ్ లోనే ఉన్న ఇలియానా బన్నీ సినిమాలో నటించడం కోసం తన పారితోషికం తగ్గించుకుంది. శక్తి సినిమాకి కోటిన్నర వసూలు చేసిన ఇలియానా ఈ చిత్రంలో అన్నీ కలుపుకుని కోటి రూపాయలకే నటించడానికి సరేనంది. జల్సా సినిమాతో తనకి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో పాటు అల్లు అర్జున్ తో తొలిసారి నటించడమనే కారణం కూడా ఇలియానా ఇంతగా అడ్జస్ట్ అవడానికి కారణమంటున్నారు.


Click it and Unblock the Notifications











