మంచు హీరో కి కమిటైన 'అందాల రాక్షసి'
ఇప్పటికే కథాచర్చలు ముగిశాయి. వచ్చే నెల 15 నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇందులో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీని ఎంపిక చేసుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. 'అందాల రాక్షసి'తో లావణ్య టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవలే విష్ణు, లావణ్యలపై ఫొటో షూట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
'దేనికైనా రెడీ'సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే వీరు పోట్ల దర్శకత్వంలో చేయబోయే తన తదుపరి చిత్రానికి సంబంధించిన గెటప్, కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసుకునే పనిలో విష్ణు నిమగ్నమయ్యారు. ఇక తనకు 'దేనికైనా రెడీ'నుంచి ఇక తనకు వరస విజయాలు ప్రారంభమయ్యినట్లే అంటున్నారు. ఇన్నాళ్లకు మంచు విష్ణుకు బ్రేక్ వచ్చిందంటున్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ...'దేనికైనా రెడీ'తర్వాత స్క్రిప్ట్ నచ్చితేనే తదుపరి సినిమాకి రెడీ చెబుతాను అన్నారు . ఈ ఆలోచనలో భాగంగా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలిసింది. మనోజ్‌తో 'బిందాస్' వంటి హిట్ చిత్రానికి, నాగార్జునతో 'రగడ' వంటి భారీ చిత్రాలకి వీరు పోట్ల దర్శకత్వం వహించిన వహించారు. దాంతో ఈ కొత్త కాంబినేషన్ పైనే మంచి అంచనాలు ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications












