చంద్రసిద్ధార్థ 'అందరి బంధువయ' స్టోరీ లైన్

By Srikanya

'ఆ నలుగురు' వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని డైరక్ట్ చేసిన చంద్ర సిద్దార్ద తాజాగా 'అందరి బంధువయ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్‌, పద్మప్రియ జంటగా నటించిన ఈ చిత్రం కథ ఏ విధంగా ఉంటుందో ఆయన మీడియాకు వివరించారు.చంద్ర సిద్దార్ధ మాట్లాడుతూ.. నవతరం ఆలోచనలకు దగ్గరగా ఉండే కథ ఇది. కార్పొరేట్‌ సంస్థలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తుంటారు హీరో, హీరోయిన్స్. తాము బ్రతికేదే నాగరిక ప్రపంచం అనుకొంటూ ఏ విలువల్నీ, అనుబంధాల్నీ దూరం చేసుకుంటారు. అయితే కథ కొనసాగుతుండగా..తాము దేన్ని దూరం చేసుకొంటున్నామో తెలుసుకొంటారు. మన మూలాల్ని వెదుక్కొంటూ వాళ్లు చేసిన ప్రయాణం హృదయాన్ని హత్తుకొంటాయన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆడియోను సైతం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో నరేష్‌, ఆర్‌.కె., విజయ్‌, కృష్ణభగవాన్‌, ఎమ్మెస్‌ నారాయణ, ఆర్యన్‌ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: జె.కె.గుమ్మడి, పాటలు: చైతన్యప్రసాద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X