‘అందాల రాక్షసి’ సెన్సార్ రిపోర్ట్
ఈ చిత్రం ట్రైలర్స్‌కు, ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడం కూడా సినిమాపై మంచి అంచనాలు పెరగడానికి కారణం అయింది. అన్నం ఉడికిందో లేదో ఓ మెతుకు పట్టుకుని చెప్పినట్టుగా... ఒక సినిమాలోని రెండు మూడు సీన్లు చూసి, ఆ సినిమా ఆడుతుందో లేదో నిర్మాత దిల్ రాజు ఇట్టే చెప్పేస్తాడని పేరుంది. అలా తను అంచనా వేసి, కొన్న సినిమాలు అతనికి ఘనవిజయాలు సాధించిపెట్టాయి కూడా. ఇప్పుడలాగే, 'అందాల రాక్షసి' చిత్రాన్ని ఆయన తీసుకున్నాడు
ఈ చిత్రం గురించి దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ- కుటుంబ ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిన ప్రేమకథ ఇదని, భూమి, సూర్యుడు, చంద్రుడు ఈముగ్గురి మధ్య ఓ ప్రేమకథ సాగితే ఎలా ఉంటుందో ఈ చిత్రం కూడా అలా వుంటుందని అంటున్నారు. 90ల్లోని బ్యాగ్రౌండ్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దీన్ని రూపొందించారు. ఆగస్టు రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత:సాయి కొర్రపాటి, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:హను రాఘవపూడి.


Click it and Unblock the Notifications












