»   » చిక్కుల్లో నాగార్జున: అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఆంధ్రా బ్యాంక్ కేసు

చిక్కుల్లో నాగార్జున: అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఆంధ్రా బ్యాంక్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఆంధ్రా బ్యాంక్ కేసు నమోదు చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ను ఆంధ్రా బ్యాంక్ విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించింది. అంటే కావాలని రుణం చెల్లించనిదిగా ప్రకటించడం. ఈ మేరకు సోమవారం ఈ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.

ఆ వార్తాకథనం ప్రకారం - బ్యాంకు రుణాలు, వ్యక్తులు లేదా సంస్థల క్రెడిట్ రేటింగ్‌కు అత్యంత ప్రామాణికమైన సిబిల్ వెబ్‌సైట్ ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్క ఆంధ్రా బ్యాంకుకే రూ.222.54 కోట్ల బకాయి పడింది. ఈ బకాయి వసూలుకు ఆంధ్రా బ్యాంక్ కేసు దాఖలు చేసింది. సిబిల్ వెబ్‌సైట్‌లోని సూట్ ఫైల్డ్ కేసుల విభాగం అన్నపూర్ణ స్టూడియోస్ పేరు ఉంది.

Andhra Bank files case against Annapurna studios

సూట్ ఫైల్ చేసిన కంపెనీ డైరెక్టర్ల పేర్లలో అక్కినేని నాగార్జున (మేనేజింగ్ డైరెక్టర్), సుప్రియ యార్లగడ్డ, వెంకట్ అక్కినేని, వెంకటేశ్ రొడ్డం, నిమ్మగడ్డ ప్రసాద్, అనుమోలు నాగ సుశీల పేర్లు ఉన్నాయి. బ్యాంక్ అధికారులు అన్నపూర్ణ స్టూడియోస్ బాకీ పడిన మాట నిజమేనని అంగీకరిస్తూ రుణం మొత్తం సిబిల్ పేర్కొన్నంతగా లేదని చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది.

అన్ని బ్యాంకులకు కలిపి అన్నపూర్ణ స్టూడియోసే బకాయిలు మొత్తం రూ. 100 కోట్ల వరకు ఉంటుందని తెలిపినట్లు కూడా రాసింది.

English summary
According to a news report- Andhra Bank has filed case against Akkineni Nagarjuna's Annapurna studios.
Please Wait while comments are loading...