ఆంధ్ర హీరోయిన్..తెలంగాణ హీరో (ఫస్ట్ లుక్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన అంశాల ప్రస్తావనతో తాజాగా ఓ ప్రేమ కథా చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి ‘ఆంధ్ర హీరోయిన్ తెలంగాణ హీరో' అనే టైటిల్ ఖరారు చేసారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది.

రఘు, ప్రియాంక ఈచిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సహకార నిర్మాణ పద్దతిలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలతో ముడి పడి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications











