ఆంధ్రాలోనూ విశ్వరూపం సినిమాను నిషేధించాలంటూ...

By Srikanya

హైదరాబాద్‌: ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధమైన సన్నివేశాలున్న 'విశ్వరూపం' సినిమాను తమిళనాడులాగే ఇక్కడ కూడా నిషేధించాలని నగర జమాయత్‌ ఉల్మా ముస్లిం సంస్థ హోంమంత్రిని కోరింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు అంజాతుల్లా ఖాన్‌, మహ్మద్‌ రెహ్మాన్‌లు సచివాలయంలో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు.

'విశ్వరూపం' చిత్రం తమిళంలో మాత్రమే విడుదల కావడం లేదు. తెలుగులో విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో సిరి మీడియా ద్వారా తెరపైకి వస్తుంది. తెలుగులో విడుదలకు ఎలాంటి అడ్డంకులూ లేవనీ, అనుకున్న ప్రకారమే విడుదలవుతుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.

కమల్‌ హాసన్‌ సినిమా 'విశ్వరూపం'ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది. సినిమా ప్రదర్శనకు సంబంధించి కేంద్ర సెన్సార్‌బోర్డు నిర్ణయమే అంతిమమని, దానికి అందరూ కట్టుబడి ఉండాలంటూ ప్రకాశ్‌ఝూ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి మనీష్‌ తివారీ గురువారం న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు.

అమెరికాలో ఉన్న కమల్‌ దీనిపై గురువారం ప్రకటన విడుదల చేశారు. ''ఈ చిత్రం ముస్లిమ్‌లకు వ్యతిరేకంగా ఉందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. వారే ఈ సినిమాని చూసి గర్వపడతారు. అల్పసంఖ్యాక వర్గాలపై ఎల్లప్పుడూ నా సానుభూతి కొనసాగుతుంది. కొందరు రాజకీయ లబ్ధి కోసం ఈ ఆందోళనలు చేస్తున్నారు. ఇలా చేయటం సాంస్కృతిక తీవ్రవాదం. నిషేధం నిర్ణయం బాధ కలిగించింద''న్నారు. నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఆయన తరఫున న్యాయవాదులు గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ చిత్రాన్ని ఇప్పటికే సెన్సార్‌ బోర్డు అనుమతించినందున నిషేధం విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గురువారం కేసు విచారణ సందర్భంగా కమల్‌ తరపు న్యాయవాది వాదించారు.

చిత్రాన్ని ముందుగా తాను చూస్తానని కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.వెంకట్రామన్‌ పేర్కొన్నారు. 26న చిత్రాన్ని చూసిన అనంతరం 28న తీర్పు ఇస్తారు. మరో వైపు పుదుచ్చేరిలో సైతం ఈ సినిమాను రెండువారాల పాటు నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రం శుక్రవారం తమిళనాడులోని 500 థియేటర్లలో విడుదల కావల్సి ఉండగా నిషేధం నిర్ణయం కారణంగా వాయిదాపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X