‘ఆంధ్రాపోరి’ గ్రూప్ సెల్ఫీ కాంటెస్ట్ (డీటేల్స్)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రసాద్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూత‌న చిత్రం ‘ఆంధ్రాపోరి'. ర‌మేష్ ప్ర‌సాద్ నిర్మాత‌. రాజ్ మాదిరాజు ద‌ర్శ‌కుడు. పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరిపారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే 15న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. సినిమా ప్రచారంలో భాగంగా ‘ఆంధ్రా పోరి' గ్రూఫ్ సెల్ఫీ కాంటెస్టు పెట్టారు. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Andhra Pori : Group Selfie Photo Contest

అమ్మాయిలు ఆ దారెంబటి పోతారని తెలిసి మీ నాన్న తన స్నేహితులతో కాపుకాసిన రోజుల గురించి చెప్పారా ఎప్పుడైనా.. ఆయనకు తెలీకుండా మీరు మీ గర్ల్‌ఫ్రెండ్స్ ని కలిసే ప్లేసెస్ గురించి ఎప్పుడన్నా ఆయనతో చెప్పారా.. అసలెక్కడ కలుస్తారు.. ఏ టైములో కలుస్తారు.. ఎవరెవరు కలుస్తారు.. ఎంతసేపు ఉంటారు... ఏం మాట్లాడుకుంటారు.. ఈ డీటెయిల్స్ వొద్దుగానీ.. అక్కడ దిగిన గ్రూప్ సెల్ఫీలుంటే లేదా దిగి పంపించండి

మీ కాలేజీ వొదిల్తే కలిసే ప్లేసు.. కంబైండ్ స్టడీస్ కోసం కలిసే ప్లేసు.. ఫ్రెండ్స్‌తో గప్పాలు కొట్టే ప్లేసు.. మధ్యలో ఆకలేస్తే గోల్‌గప్పాలు తినే ప్లేసు.. మెర్క్యురీ కేఫయినా.. మెక్డీ రెస్టరెంటయినా.. ఐమాక్సు థియేటరయినా.. ఆపక్క నెక్లెస్ రోడ్డయినా.. రోడ్డెక్కి తిరగండి.. సెల్ఫీలు దిగండి.. ఇక్కడ పోస్టు చేయండి.. లైకులు తెచ్చుకోండి.. ప్రైజులు కొట్టేయండి.. ఈ కాంటెస్టు పన్నెండు రోజులుంటుంది.. ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు.. రోజుకో విన్నర్.. మొత్తం మీద ఒక గ్రాండ్ విన్నర్.. గుర్తుంచుకోండి.. విన్నింగ్ క్రైటీరియా కేవలం మీ సెల్ఫీకొచ్చిన లైకులు మాత్రమే..

ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె, పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు, సంగీతం: డా.జె., ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల, నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X