పవన్‌కు అరుదైన గుర్తింపు ఇచ్చిన చంద్రబాబు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో.. తొలి డిప్యూటీ సీఎంగా!

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న పొలిటికల్ లీడర్లలో పేర్లలో పవన్ కల్యాణ్ ఒకటి. దీనికి కారణం ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి.. గత ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాడమే.

దీంతో అతడి పేరు మారుమ్రోగిపోవడంతో పాటు పవర్ స్టార్‌కు కేబినెట్‌లోనూ చోటు దక్కింది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు మీకోసమే!

Andhra Pradesh CM Chandrababu Orders About Pawan Kalyan Photo In Govt Offices

ఏర్పడిన కొత్త ప్రభుత్వం
మూడు రోజుల క్రితం అత్యంత అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లిద్దరి తర్వాత కేబినెట్ మినిస్టర్లు కూడా ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Andhra Pradesh CM Chandrababu Orders About Pawan Kalyan Photo In Govt Offices

జనసేనానికి ప్రత్యేకంగా

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదాను కట్టబెట్టారు. అదే సమయంలో కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించారు.

పవన్ కోసం ఏర్పాట్లతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కోసం సచివాలయంలో ప్రత్యేకమైన బ్లాకులను కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే, మరిన్ని సౌకర్యాలను సైతం పవన్‌కు చంద్రబాబు ఇవ్వనున్నారు.

Andhra Pradesh CM Chandrababu Orders About Pawan Kalyan Photo In Govt Offices

పవన్‌కు మరో గుర్తింపు

సాధారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లో రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితో పాటు ఆయా శాఖల మంత్రుల ఫొటోలను కచ్చితంగా పెట్టాలని పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవగానే జగన్‌ స్థానంలో చంద్రబాబు ఫొటోలను పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక గుర్తింపును ఈ ప్రభుత్వం ఇచ్చింది.

ఫొటో పెట్టాల్సిందేనని
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫొటోతో పాటు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ ఫొటోను కూడా పెట్టాల్సిందే అని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. తద్వారా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఈ ఘనతను అందుకున్న తొలి డిప్యూటీ సీఎంగా పవన్ రికార్డు సాధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X