పేదలకు సినిమా ఇండస్ట్రీ శత్రువులు.. టికెట్ రేట్ల పెంపు మీద నోరు విప్పిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టికెట్ ధరల పై తొలిసారిగా స్పందించారు. బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టికెట్ ధరల పెంపును వ్యతిరేకించే వారిని పేదల వ్యతిరేకులుగా అభివర్ణించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
 మూకుమ్మడి దాడి

మూకుమ్మడి దాడి

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వకీల్ సాబ్ సినిమా సమయంలో మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఏపీలో పంచాయితీ ప్రాంతాల్లో మరీ దారుణంగా 15 రూపాయల టికెట్ రేట్లు ప్రకటించడంతో అందరూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అయినా సినిమా పరిశ్రమ నుంచి మాత్రం గట్టి ప్రతిస్పందన మాత్రం కనిపించలేదు. నాని లాంటి వారు మాట్లాడితే వారి మీద మూకుమ్మడి దాడి ప్రభుత్వం తరపున జరిగింది. అందుకే ఇంకెవరూ మాట్లాడడానికి కూడా సాహసించని పరిస్థితి నెలకొంది.

 ఏపీ రాజకీయాల్లో హీట్‌

ఏపీ రాజకీయాల్లో హీట్‌

అయితే సినిమా వాళ్ళు సైలెన్స్ పాటిస్తున్నా సరే ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్‌ పెంచిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్, నాని లాంటి సినీ ఇండస్ట్రీ వారు మొదలు రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం మీద కామెంట్లు చేయడం, కౌంటర్లు ఇవ్వడంతో ద్ద రచ్చే జరుగుతోంది.. ఇక, సినిమా టికెట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తమ కష్టాలు తీరుస్తుందని వారు భావిస్తున్నారు.

తొలిసారిగా

తొలిసారిగా

అయితే ఇప్పటి వరకు నేరుగా సినిమా టికెట్ల ఇష్యూ మీద మాట్లాడని సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఇప్పుడు ఈ అంశం మీద స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపును లాంఛనంగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.. కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

వారు పేదలకు శత్రువులు

వారు పేదలకు శత్రువులు

"నేను పేదలకు సరసమైన ధరలకు వినోదాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడు నన్ను విమర్శించే వారు కూడా విడిచి పెట్టలేదు. పేదలను దృష్టిలో ఉంచుకుని రేట్లు నిర్ణయించాం, దానికి కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించే వాళ్లేనా..? పట్టించుకునే వాళ్లేనా..? వారు పేదలకు వ్యతిరేకం. వారు పేదలకు శత్రువులు'' అని ముఖ్యమంత్రి అన్నారు. తమకు ఎన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేసినా అభివృద్ధి జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

 వారికి షాకింగ్

వారికి షాకింగ్

టికెట్ ధరల వ్యవ హారంపై ముఖ్య మంత్రి స్పందించడం ఇదే తొలిసారి కావడం, ఈ విధంగా మాట్లాడటం సినీ వర్గాలకు మాత్రం దారుణమైన వార్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ చట్టాన్ని పేదల పక్ష పాతిగా ముద్ర వేస్తున్నారు, దాని పట్ల గర్వంగా ఉందని అంటున్నారు. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారం రేట్లు సవరించే అవకాశం లేదు. ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ప్రభుత్వ నియమించిన కమిటీ వల్ల తమ ఇబ్బందులు తొలగుతాయని భావిస్తుండగా సీఎం మాటలు వారికి షాకింగ్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X