హీరో కార్తిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త అంటూ ఘాటుగా!
కొన్ని విషయాలు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూల అంశం ఒకటి. గత ప్రభుత్వ హయాంలో వీటి తయారిలో కల్తీ జరిగిందని రిపోర్టులు రావడం కలకలం రేపింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో తమిళ స్టార్ హీరో కార్తి లడ్డూ వివాదంపై మాట్లాడాడు. దీంతో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అతడికి సీరియస్ కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందో మీరే చూడండి!
లడ్డూ వివాదంతో సంచలనం
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో తయారు చేసిన లడ్డూలలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారన్న న్యూస్ సంచలనంగా మారిపోయింది. అప్పటి నుంచి దీనిపై ఎన్నో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుని విచారణను జరుపుతోంది.

పవర్ స్టార్ ప్రాయశ్చిత్త దీక్ష
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని కాపాడే చర్యల్లో భాగంగానే ఆయన విజయవాడలో ఇంద్రకీలాద్రి ఆలయం శుద్ధి కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ అనేది హిందువుల మనోభావాలకు సంబంధించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

లడ్డూ గురించి కార్తికి ప్రశ్న
ఒకవైపు తిరుమల లడ్డూ గురించి వివాదం నడుస్తోన్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో తమిళ హీరో కార్తికి దీనిపై ప్రశ్న ఎదురైంది. అతడు నటించిన 'సత్యం సుందరం' సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో జరిగిన ఈవెంట్‌లో యాంకర్ 'లడ్డూ కావాలా నాయనా' అనే కాన్సెప్టుతో యాంకర్ అతడిని కొన్ని ప్రశ్నలు అడగబోయింది.
Actor Karthi జోక్ కి Pawan Kalyan సీరియస్.. #Karthi #PawanKalyan #Janasena #Tirupati #TirupatiLaddu #Teluguoneindia #Oneindiatelugu pic.twitter.com/lcwKWH19gi
— oneindiatelugu (@oneindiatelugu) September 24, 2024
సెన్సిటివ్ మేటర్ కాబట్టి
మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సత్యం సుందరం' మూవీ ఈవెంట్‌లో యాంకర్ లడ్డూ గురించి హీరో కార్తిని ప్రశ్నించింది. దీంతో అతడు భయపడుతూ 'ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఇది సెన్సిటివ్ టాపిక్. నాకు లడ్డూ వద్దు' అంటూ సమాధానం చెప్పాడు. అప్పుడు అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. ఫలితంగా ఇది హాట్ టాపిక్ అవుతోంది.

కార్తికి పవన్ స్ట్రాంగ్ కౌంటర్
లడ్డూ గురించి కార్తి చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. 'నిన్న ఓ సినిమా ఫంక్షన్‌లో లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ అని జోకులు వేస్తున్నారు. మరోసారి అలా మాట్లాడకండి. సినిమా వాడిగా యాక్టర్లు అంటే నాకు గౌరవం ఉంది. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా వందసార్లు ఆలోచించుకోండి' అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ లడ్డూ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లు అయింది.


Click it and Unblock the Notifications











