twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ సినిమా టికెట్ల విక్రయానికి ''యువర్‌ స్క్రీన్స్‌ పోర్టల్‌''.. ఇక ఆ పోర్టల్స్ దందాకు చెక్!

    |

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా నలుగుతున్న ఆన్ లైన్ సినిమా టికెట్ల వ్యవహారంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. బ్లాక్ టికెటింగ్ దందాకు చెక్ పెట్టి టికెట్ల అమ్మకం అంతా పారదర్శకంగా జరిగేలా చూడటానికి ఆన్లైన్ వేదికగా సినిమా టికెట్ల విక్రయాలు జరిపేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద థియేటర్ల యజమానులకు అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసం 'యువర్ స్క్రీన్స్' పోర్టల్ ను తీసుకొస్తోంది.

    ఇక ఏపీ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఇకపై ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో నడిచే 'యువర్ స్క్రీన్స్' పోర్టల్ నుంచే సినిమా టికెట్ల అమ్మకాలు జరపాల్సిందిగా ప్రభుత్వం థియేటర్లను ఆదేశించింది. ఇక ఈ పోర్టల్ ద్వారా ఇతర పోర్టల్స్ అంటే బుక్ మై షో, పెటీఎం వంటి వాటి కంటే రూ.20 - రూ.25 తక్కువకు టికెట్లను విక్రయించనున్నారు. అంతే కాక ప్రభుత్వం తీసుకొస్తూన్న ఈ యువర్ స్క్రీన్స్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు తాజాగా వెల్లడించారు. ఇక నిన్నమొన్నటి దాకా థియేటర్లు టెన్షన్ పడినట్టు నెలకు ఒకసారి కాకుండా ఏ రోజు డబ్బులను ఆరోజే థియేటర్ల ఖాతాలలో జమ చేస్తామని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

    Andhra Pradesh Film Development Corporation to launch ‘Your Screens to book movie tickets

    అయితే ఇప్పటికే ఇతర పోర్టల్స్ తో ఉన్న ఒప్పందాలను కూడా కొనసాగించనుంది. ఇక ఈ పోర్టల్ ద్వారా కనుక టికెట్‌ బుక్‌ చేసుకుంటే ధరపై 1.95 శాతం మాత్రమే సర్వీస్ ఛార్జ్ ఉంటుందని చెబుతున్నారు. ఇతర ఆన్‌లైన్‌ పోర్టల్ల ద్వారా బుక్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌పై ప్రేక్షకుడికి అదనంగా రూ.20 నుంచి రూ.25 వరకూ భారం పడుతోండగా అది బాగా తగ్గనుంది. ఇక ప్రభుత్వం తీసుకొచ్చే ఆన్ లైన్ టికెటింగ్ విధానంతో థియేటర్లకు ఉన్న గత ఒప్పందాలు రద్దు కావని ఏపీఎఫ్డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రమంలో ఏపీలో తక్కువ ధరలకే బుకింగ్ సౌకర్యం కల్పించినట్టు అయింది. అయితే దీని వల్ల ప్రైవేట్ పోర్టల్స్ ఇబ్బంది పడడం ఖాయం.

    Read more about: tollywood
    English summary
    Andhra Pradesh Film Development Corporation to launch ‘Your Screens' to book movie tickets
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X