100 ఎకరాల్లో భారీ సినీ స్టూడియో.. పవన్ కల్యాణ్ చొరవతో ఆంధ్రాలో నిర్మాణం ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు సానుకూల వాతావరణం ఏర్పడిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి బీజాలు పడుతున్నాయి. అలాగే థియేటర్లు యజమానులకు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు సర్కారు అండగా నిలిచే ప్రయత్నాలు కనిపించడంతో సినీ వర్గాలు కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్లేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ స్టూడియో ఏర్పాటుకు సిద్దమవుతున్నదనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
గత ప్రభుత్వ హాయాంలో తెలుగు సినిమా తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొన్నది. సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో అనేక వివాదాలతో 5 ఏళ్లు కష్టంగా గడించింది. తెలుగు సినిమాను గత ప్రభుత్వం టార్గెట్ చేసిందనే మాటలు పవన్ కల్యాణ్, నాని, ఇతర హీరోల నుంచి స్పష్టంగా వినిపించాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచే ప్రయత్నం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సర్కార్ చొరవ చూపడంతో నిర్మాతలు, వ్యాపార వర్గాలు భారీ ప్లాన్స్‌తో సిద్దమవుతున్నారు. ఆంధ్రాలో సినిమాల నిర్మాణానికి గాను రాష్ట్రప్రభుత్వం ఓ భారీ స్టూడియో నిర్మాణానికి పూనుకుంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఓ స్టార్ హీరో కలిసి పరిశ్రమ విస్తరణపై చర్చించినట్టు సమాచారం.
ఇలాంటి చర్చల నేపథ్యంలో రాజధాని అమరావతి చుట్టుపక్కల సినిమా పరిశ్రమ అభివృద్దికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో కంచికచర్ల వద్ద భారీ స్టూడియోకు ప్లాన్ జరుగుతున్నది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. దాదాపు 100 ఎకరాల్లో స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించే విషయం పరిశీలనలో ఉందనే విషయం చర్చనీయాంశమైంది.
ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ స్టూడియో నిర్మాణం ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్‌కు 4 గంటల ప్రయాణం, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు, విజయవాడ రైల్వే జంక్షన్, రాజధానికి అమరావతికి అతి సమీప ప్రాంతం కావటంతో ఈ ఎంపిక జరిగినట్లుగా సమాచారం.
త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో పవన్‌కళ్యాణ్ మరో దఫా చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ చేస్తారని తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్రప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించిన నామమాత్రపు రుసుంతో స్టూడియో అద్దెకిస్తున్నాయి. ఇదే విధంగా రాష్ట్రంలో స్టూడియో నిర్మించి సినిమాలకు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉంది.


Click it and Unblock the Notifications











