twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాలి.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు!

    |

    news- inఆంధ్రప్రదేశ్లో చాలాకాలం నుంచి సినిమా టికెట్ల వ్యవహారం మీద ఉన్న కొంత సందిగ్ధత తొలగిపోయింది అనుకుంటున్న తరుణంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జీవో నెంబర్ 69 గా తాజాగా విడుదల చేసింది. గతంలోనే ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు టికెట్ల అమ్మకం విధ్యాంలో మరింత స్పష్టతనిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రూపొందించింది. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం ప్రస్తుతం ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్లను విక్రయిస్తున్న సంస్థలు కూడా ఇకపై ప్రభుత్వ నోడల్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన వివాదం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ టికెట్ల ఆన్ లైన్ అమ్మకానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

    ఏపీఎఫ్‌డిసి‌కి సర్వీస్‌ ప్రొవైడర్‌ బాధ్యతలు అప్పగించడంతో ఇకపై రాష్ట్రంలోని సినిమా థియేటర్లు ఇక మీదట ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజా గైడ్ లైన్స్ ప్రకారం అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వం నియమించిన నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసే సర్వీస్‌ ప్రొవైడర్ గేట్‌ వే నుంచి టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రైవేటు బుకింగ్ సంస్థలు ప్రతి టిక్కెట్‌పై 2శాతం మాత్రమే సర్వీస్ ఛార్జీ అమలు చేయాల్సి ఉంటుంది. అంతేకాక థియేటర్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయాలను జరపాల్సి ఉంటుంది. కొత్త సినిమాల విడుదల సమయంలో వారం ముందు మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఈ ప్రక్రియ మీద ముందు నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి.

    Andhra Pradesh government to take over the sales of online tickets

    అయితే ఒకసారి ఈ ప్రక్రియ మొదలై అమలు అయ్యేసరికి అసలు సమస్యలు, వివాదాలు బయటకు వస్తాయేమో చూడాలి. అయితే ఇక్కడ వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే విషయం ఏదైనా ఉందా అంటే అది క్యాన్సిలేషన్. బుక్‌ చేసుకున్న టిక్కెట్‌ను వినియోగదారుడు నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే జీఎస్టీ, సర్వీసు చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయాలని జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ఏపీ వ్యాప్తంగా జాయింట్‌ కలెక్టర్‌లు థియేటర్ల యజమానులను సమావేశానికి పిలిచి చెబుతున్నారు. డీఆర్వో, ఆర్‌డీఓలతో కలసి థియేటర్ల యజమానులతో మాట్లాడుతూ ఈ విషయం మీద అవగాహన కల్పిస్తున్నారు.

    English summary
    Andhra Pradesh government to take over the sales of online tickets
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X