For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆంధ్రప్రదేశ్‌లోనూ బిగ్ బి ‘ఆరక్షణ్’పై బ్యాన్

    By Bojja Kumar
    |

    బిగ్ బి అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనే ప్రధాన పాత్రల్లో ప్రకాష్ ఝా రూపొందించిన బాలీవుడ్ మూవీ 'ఆరక్షణ్" సినిమాను ఆంద్రప్రదేశ్ లోనూ నిలిపి వేశారు. ఈ మేరకు రేపు(ఆగస్టు 12) విడుదల కావాల్సిన సినిమాను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురువారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. భారత దేశ విద్యా వ్యవస్థలో కులపరమై రిజర్వేషన్ల వ్యతిరేకించే విధంగా ఈ సినిమా ఉందని, ముఖ్యంగా దళితుల మనోభావాలను కించ పరిచే విధంగా సినిమా ఉంటుందని కొన్ని సంస్థలు ఆందోళన చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలను ఆపేయాలని కొన్ని దళిత సంఘాల ప్రతినిధులు గురువారం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు.

    ఈ సినిఃమాపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని మాయావతి ప్రభుత్వం నిషేదం విధించింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సినిమాపై విడుదలకు బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించే స్క్రీనింగ్ కమిటీ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటామని పంజాబ్ పభుత్వ వర్గాలు తెలిపాయి.

    English summary
    Andhra Pradesh state government has banned the release of the Amitabh Bachchan starrer socio-political movie Aarakshan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X