Bro The Avatar నన్ను గోకితే.. మూల్యం చెల్లించుకొంటారు.. త్రివిక్రమ్‌కు అంబటి వార్నింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో ది అవతార్ సినిమాలో శ్యాంబాబు సన్నివేశంపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై రెచ్చగొట్టే విధంగా గోకిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై భారీ స్థాయిలో మండిపడ్డారు. బ్రో సినిమా డిజాస్టర్ అంటూ తనకు తోచిన కారణాలను ఆయన వెల్లడించారు. బ్రో ది అవతార్ సినిమా వివాదంపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..
Bro The Avatar సినిమా సూపర్ హిట్ అని చెప్పుకొంటున్నారు. సక్సెస్ మీటింగులు పెట్టుకొంటున్నారు. కానీ అసలు ఏమిటంటే? బ్రో సినిమా డిజాస్టర్. ఈ విషయాన్ని ఆధారాలు లేకుండా చెప్పడం లేదు. ఆధారాలతో సహా చెబుతున్నాను. ఆ సినిమా కలెక్షన్లు చూస్తే.. నిన్నటి వరకు 55 కోట్ల మేర షేర్ కలెక్ట్ చేసింది. సోమవారం 2 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్‌గా 65 లేదా 70 కోట్లు రావొచ్చు అని అంబటి అన్నారు.

బ్రో సినిమాకు పవన్ కల్యాణ్ తీసుకొన్న రెమ్యునరేషన్ 70 కోట్లు. ఈ సినిమా ఆయన తీసుకొన్న రెమ్యునరేషన్ కూడా రాలేని పరిస్థితి. అందుకు కారణం సరైన విజన్ లేకుండా సినిమా తీయడం. అవసరం లేని సీన్లు జొప్పించి సినిమా తీయడమే కారణం అన్నారు. ఇక పవన్ కల్యాణ్ సినిమాలు ఆడవు. వారాహి అనే వాహనాన్ని కాళ్ల పెట్టుకొని నామకరణం చేశాడో.. ఆ వాహనం ఎక్కి అబద్దాలు చెప్పడం ప్రారంభించాడో.. అప్పటి నుంచి ఆయనకు శాపం తగిలింది అని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.
రాజకీయ నాయకులను సినిమాల్లో పెట్టి అక్కడక్కడ గోకే ప్రయత్నం చేస్తున్నారు. అలా గోకితే నేను స్వయంగా ఒకటి ఆలోచించాను. సినిమాల్లో ఎవరిని పడితే వారిని గొకితే సక్సెస్ కావు. దమ్ముంటే పొలిటికల్ సైటెర్స్ తీయవచ్చు. శ్యాంబాబు కాకపోతే రాంబాబు అని పేరు పెట్టుకోవచ్చు. నా డ్యాన్స్ సింక్ కాలేదని అంటున్నారు. నేను డ్యాన్స్ మాస్టర్‌నా? మా అన్నయ్య డ్యాన్స్ మాస్టరా? అని నిర్మాతలు తెలుసుకోవాలి అని అంబటి రాంబాబు అన్నారు.
బ్రో సినిమా కోసం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఓ సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలను, నటులను, దర్శకులకు, త్రివిక్రమ్ లాంటి రచయితలకు.. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే.. ఇలాంటి గుణపాఠాలు నేర్చుకొంటారు. తగిన మూల్యం చెల్లించుకొంటారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అని అంబటి రాంబాబు తెలిపారు.
రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయవచ్చు.. సినిమాల్లో ఉంటూ రాజకీయాల్లో చేస్తే..ఒకటి మాత్రం జరగడ ఖాయం. సినిమాలు వదలకపోతే.. సినిమాలు నాశనం అవుతాయి. రాజకీయాలు నాశనం అవుతాయి. ఎన్టీఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అప్పుడప్పుడు సినిమాల్లో నటించాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి కూడా సినిమాలు చేయలేదు అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.


Click it and Unblock the Notifications











