Bro The Avatar ఏపీ మంత్రి అంబటిపై బ్రో మూవీలో సెటైర్లు .. శ్యాంబాబు ఎపిసోడ్‌పై భారీగా ట్రోలింగ్.. వీడియో వైరల్

తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమా ఆధారంగా తెరకెక్కిన బ్రో ది అవతార్ (Bro The Avatar) చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో పబ్ ఎపిసోడ్‌లో ఎపిసోడ్‌లో మంత్రి అంబటి రాంబాబు‌ను టార్గెట్ చేస్తూ తీసిన సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఈ ట్రోలింగ్ సీన్ వివరాల్లోకి వెళితే..

ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ మధ్య వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు, ఆరోపణల జోరు కొనసాగుతున్నది. క్షేత్రస్థాయిలో ఒకరిపై మరొకరు భారీగా కామెంట్స్ చేసుకొంటున్నారు. ఈ క్రమంలో బ్రో ది అవతార్ (Bro The Avatar) సినిమా రిలీజైంది. ఈ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ తనదైన శైలిలో పొలిటికల్ పంచులు వేస్తారని అందరూ ఊహించారు. అయితే భారీగా వేయకపోయినా అక్కడక్కడ పరోక్షంగా సెటైర్లు వేయడం ప్రేక్షకుల, నెటిజన్లను ఆకర్షించింది.

Andhra Pradesh Minister Ambati Rambabu trolled heavily in Pawan Kalyans Bro

బ్రో ది అవతార్ సినిమాలో ఓ పబ్ సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సీన్‌లో అమ్మాయిల పిచ్చి ఉన్న శ్యాంబాబు (30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ) అనే క్యారెక్టర్ నాన్ సింక్‌లో మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటాడు. దాంతో పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్లే అవుతున్న మ్యూజిక్ ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అంటూ సీరియస్ అవుతాడు.

అయితే బ్రో ది అవతార్ (Bro The Avatar) సినిమా పబ్ సీన్‌లో క్యారెక్టర్‌ను చూస్తే.. గతంలో సంక్రాంతి పండుగ సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఓ వేడుకలో డ్యాన్స్‌ను పోలినట్టు ఉండే విధంగా ఉండటంతో కొంత రిలేట్ అవుతున్నారు. ఆ రోజు మంత్రి అంబటి వేసిన డ్రస్సును పోలిన డ్రస్సును శ్యాంబాబుకు వేయడంతో ఈ సీన్ వైరల్‌గా మారింది.

బ్రో ది అవతార్ (Bro The Avatar) సినిమా రిలీజ్ తర్వాత 1, 2, 3 అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్‌ను కట్ చేసి.. శ్యాంబాబు వేసిన స్టెప్పుల వీడియోను, అంబటి రాంబాబు వేసిన వీడియోను మిక్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోను నెటిజన్లు షేర్లు చేసి, లైక్ కొట్టి కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

అయితే శ్యాంబాబు పబ్ ఎపిసోడ్ వ్యవహారంపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఇప్పటి వరకు అంబటి రాంబాబు స్పందించకపోవడంపై నెటిజన్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే అంబటి దృష్టికి వెళ్లిందా? ఆ విషయంపై మాట్లాడితే సినిమాకు పాజిటివ్‌గా మారుతుందా అనే కోణంలో వ్యూహాత్మకంగా వైసీపీ శ్రేణులు మౌనం వహించారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X