twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టికెట్ రేట్లు పెంచేస్తున్నారు.... ఈ సారి సంక్రాంతికి మనకు మోత మోగేలా ఉంది.., ఎందుకూ అంటే....

    తాజాగా టికెట్ల రేట్లు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై హైకోర్టు కొన్ని సూచ‌న‌లు చేసింది. ఏపీ, తెలంగాణాలలోని సినీ థియేటర్స్ లో టికెట్ల రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

    |

    సినిమా అతి చ‌వ‌కైన వినోద సాధ‌నం అంటూ మ‌న నిర్మాత‌లు త‌రచూ చెబుతుంటారు. రెండు గంట‌ల వినోదాన్ని వంద రూపాయ‌లకే ఇచ్చేస్తున్నామ‌న్న‌ది వారి మాట‌. దానికి త‌గ్గ‌ట్టుగానే రూ.20, రూ.50,రూ. 70ల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మ‌ల్టీప్లెక్స్‌కి వెళ్తే మాత్రం రూ.150 చెల్లించుకోవాల్సిందే. అయితే ఈ రేట్లు భ‌విష్య‌త్తులో మారే అవ‌కాశం ఉందా?? అవున‌నే అనిపిస్తోంది.

    తాజాగా టికెట్ల రేట్లు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై హైకోర్టు కొన్ని సూచ‌న‌లు చేసింది. ఏపీ, తెలంగాణాలలోని సినీ థియేటర్స్ లో టికెట్ల రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రేట్లను నిర్ణయించేందుకు ముఖ్య కార్యదర్శులు, హోం శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ హైకోర్టు ఈ రెండు రాష్ట్రాలప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసినపిటిషన్లను న్యాయమూర్తి రాజా ఎళంగో పరిష్కరిస్తూ ఈ మేరకు ఆదేశించారు.

    ప్రేక్షకుడే:

    ప్రేక్షకుడే:

    కోట్లు కొల్లగొట్టే చిత్రపరిశ్రమలో ప్రధాన వాటాదారుడు ప్రేక్షకుడే. వినోదం, విశ్రాంతి..అభిమానం ఈ మూడు కారణాలతోనే ప్రేక్షకుడు సినిమాలు ఎంచుకుంటున్నాడు. టికెట్‌తో విశ్రాంతి సమయంలో ఖర్చుకు, పార్కింగ్ ట్రాన్స్‌పోర్టు వంటి ఖర్చులకు సిద్ధపడే థియేటర్లవైపు పరుగులు తీస్తూనే ఉన్నాడు. సినిమాయే ప్రధాన వినోదంగా ఉన్న తరుణంలో కుటుంబం, స్నేహితులతో సినిమాకు వెళ్లాలంటే ఖర్చును బేరీజు వేసుకునేవాడు.

    ప్రధాన కారణం:

    ప్రధాన కారణం:

    సినిమా టికెట్ ధర పెరిగిందన్న బోర్డు థియేటర్ వద్ద చూస్తే అనేకరకాలుగా కామెంట్ చేసేవాడు. కానీ ఈనాడు ఎంత ధర పెంచి కౌంటర్‌లో టికెట్ కొంటున్నా కామెంట్ చేయడంలేదు. దానికి ప్రధాన కారణం కుటుంబం, స్నేహితులు, అంతా కలిసి వెళ్లటం చాలా వరకూ తగ్గిపోయింది.

    అధిక టికెట్ ధరలే:

    అధిక టికెట్ ధరలే:

    పిల్లలకు కంప్యూటర్ గేమ్స్, యువకులకు నెట్ ఛాటింగ్స్, మహిళలకు సీరియల్స్ వచ్చాక సినిమా చిన్న బోయింది. అందుకే ఓపెనింగ్స్ కూడా డల్ అయిపోయాయి. అయినా కూడా షో కలెక్షన్లు ఘనంగా కనిపిస్తున్నాయి. కారణం అధిక టికెట్ ధరలే. 400మంది ఆడియన్స్ చూస్తే వచ్చే ఆదాయం 40మంది చూస్తే వచ్చేస్తుంది. ప్రేక్షకుల సంఖ్య తగ్గినా కలెక్షన్లు కోట్లు దాటుతున్నాయి.

    ఎవరికి లాభం?:

    ఎవరికి లాభం?:

    అధిక ధరల వలన ఎవరికి లాభం? అని ప్రశ్నించుకుంటే సక్సెస్ ఉన్న సినిమాలకేనని చెప్పాలి. సక్సెస్ లేకపోతే ప్రేక్షకుడు వేసుకునే సినిమాల లిస్టులో ఆ సినిమా ఉండదంతే! అగ్రహీరోలకు వేల రూపాయలు పెట్టి కొని చూసే అభిమానులు ఉండనే ఉన్నారు. ఇంటర్నెట్ బుకింగ్ సౌకర్యంతో టికెట్ ఇంటికేవస్తున్న తరుణంలో సినిమా రిజల్టుని బట్టే ప్రేక్షకుడు ఎంత ధరైనా చెల్లిస్తున్నాడు.

    ఆనందం కలిగించే వార్త:

    ఆనందం కలిగించే వార్త:

    ఇప్పుడు ఇదే అంశం మీద హైకోర్టు స్పందించింది.పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్న తేడా లేకుండా అన్నిటికీ ఆనందం కలిగించే వార్త ఇది. కానీ, సగటు సినీ అభిమానికి మింగుడుపడనిది. సత్వరమే టికెట్ల రేట్లు పెంచాల్సిందిగా థియేటర్ల యజమానులను హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది.

    సత్వరమే పెంచాలని:

    సత్వరమే పెంచాలని:

    ఆ తీర్పు సంక్రాంతికి విడుదలవుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలకు కొంత శక్తినిచ్చేదే అయినా.. ప్రేక్షకుడిని మాత్రం నిరుత్సాహ పరిచే తీర్పు అది. అయితే సత్వరమే పెంచాలని హైకోర్టు ఆదేశించినా.. టికెట్ రేట్లు ఎంత పెంచాలన్న దానిపై హోం శాఖ కార్యదర్శులు కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయించాల్సి ఉంది.

    మార్చి 31లోగా:

    మార్చి 31లోగా:

    అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని మార్చి 31లోగా కమిటీ కొత్త రేట్లను నిర్ణయించాల్సి ఉంది. తర్వాత వెనువెంటనే థియేటర్లు రేట్లను పెంచేయొచ్చు. ఈ ఉత్తర్వులు వచ్చేందుకు మరో 3నెలలు పట్టినా.. వెంటనే రేట్లు పెంచాలన్న హైకోర్టు తీర్పు సినిమాలకు కొంత శక్తినిస్తుందని పలువురు థియేటర్ యజమానులు అంటున్నారు.

    బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోతున్నార‌ని:

    బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోతున్నార‌ని:

    పంచాయ‌తీ, మున్సిపాలిటీ, కార్పొరేష‌న్‌.. ఇలా ఏరియాని బ‌ట్టి రేట్లు ఉండ‌డం వ‌ల్ల‌.. కొంత‌మంది బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోతున్నార‌ని, టికెట్ రేట్ల‌లో ఏక రూప‌త చూపించాల‌న్న‌ది పిటీష‌న్ దారులు పేర్కొన్నారు. దీనిపై స‌మ‌గ్ర‌మైన విచార‌ణ జ‌రిపించాల‌ని కోర్టు ఆదేశించింది.

     ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని:

    ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని:

    ఈ విష‌యంపై 2017 మార్చి నాటికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని కోర్టు సూచించింది. దాన్ని బ‌ట్టి టికెట్ రేట్ల‌లో మార్పులు రావ‌డం త‌థ్య‌మ‌ని అనిపిస్తోంది. మ‌ల్టీప్లెక్స్‌ల్ని ప‌క్క‌న పెట్టి, అన్ని సింగిల్ థియేట‌ర్ల‌లో ఒకే త‌ర‌హా రేటు ఉండేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం ఉంది.

    రేట్ల సంగ‌తి స‌రే:

    రేట్ల సంగ‌తి స‌రే:

    ఇది ఓ విధంగా నిర్మాత‌ల‌కు లాభ‌సాటి వ్య‌వ‌హార‌మే. రేట్ల సంగ‌తి స‌రే, థియేట‌ర్లో క‌నీస సౌక‌ర్యాల మాటేంటి? దాదాపు 80 శాతం థియేట‌ర్ల‌లో మ‌రుగు దొడ్ల నిర్వ‌హ‌ణ అధ్వానంగా ఉంది. ప్ర‌తీ థియేట‌ర్లో మంచి నీటి సౌక‌ర్యం క‌ప్పించాల‌ని కోర్టులు ఆదేశిస్తున్నా.. దాన్ని ప‌ట్టించుకొనే నాథుడు లేడు.

    దుపాయాలు మెరుగు ప‌ర‌చి:

    దుపాయాలు మెరుగు ప‌ర‌చి:

    సౌక‌ర్య‌వంత‌మైన సీట్లు క‌ల్పించ‌డంలో ఎందుకు అశ్ర‌ద్ద చూపిస్తున్నారు? పేరుకే ఏసీ హాళ్లు.. చాలా థియేట‌ర్ల‌లో అవి ప‌నిచేయ‌వు. ముందు థియేట‌ర్ల‌లో మౌళిక స‌దుపాయాలు మెరుగు ప‌ర‌చి, ఆ త‌ర‌వాత రేట్లు గురించి మాట్లాడితే బాగుంటేందేమో..?

    English summary
    The Hyderabad High Court has directed the AP and TS governments to constitute committees headed by the principal secretaries, home, to fix rates of admission into various classes in cinema theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X