Radhe shyam :చివరి నిమిషంలో గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చివరి నిమిషంలో గుడ్ న్యూస్ చెప్పాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇప్పటికే జారీ చేయగా విడుదలకు ముందు రోజు అంటే గురువారం నాడు మరో శుభవార్త అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక శుభవార్త ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే

మార్చి 11వ తేదీన
సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ దాదాపు మూడేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. పీరియాడిక్ లవ్స్టోరీగా రూపొందించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కృష్ణంరాజు, సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

202.80 కోట్లకు
తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాని దాదాపు 860 థియేటర్లలో విడుదల చేయనున్నారు. తమిళనాడులో 175, కర్నాటకలో 185, కేరళలో 150, హిందీ రెస్టాప్ ఇండియాలో 2200, ఓవర్సీస్‌లో 3400 థియేటర్లలో కలిపి మొత్తంగా 7010 థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా రైట్స్ అన్నీ కలిపి రూ. 202.80 కోట్లకు అమ్ముడయ్యాయి.

ధరలు పెంచుకునే వెసులుబాటు
అయితే రాధేశ్యామ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నాన్ ప్రీమియం టికెట్ రేట్లు పెంచలేదు కానీ ప్రీమియం రూ. 25 పెంచుకునేందుకు నిర్మాతలకు అవకాశం కల్పించింది. రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ రూ. 170 కోట్లు అని చెబుతూ జీఎస్టీ సహా ఇతర అకౌంట్ బిల్లును ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ సమర్పించింది. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ కాకుండా రూ. 100 కోట్ల సినిమా నిర్మాణానికే ఖర్చు అయితే టికెట్ రేట్ పెంచే వెసులుబాటు ఇస్తామని గతంలో స్వయంగా సీఎం జగన్ ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
మరోపక్క తెలంగాణ ప్రభుత్వం మరో తీపికబురు తెలిపింది. ఈ మధ్య టికెట్ల ధరల విషయంలో సినిమా ఇండస్ట్రీకి అనుగుణంగా జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు 5వ ఆటకు అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము ఒంటి గంట మధ్యలో 5వ షోకు అనుమతి ఇస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

షరతులు విధించి
ఈ 5వ షో అనుమతి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, అన్ని సినిమాలకు వర్తిస్తుందని తెలిపారు. చిన్న సినిమాల కోసం 5వ షో అనుమతి కావాలంటూ అనేకమార్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇండస్ట్రీ తరపు నుంచి వినతులు వెళ్లగా తెలంగాణ ప్రభుత్వం 5వ షోకి అనుమతి ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇటీవల విడుదల చేసిన కొత్త టికెట్ ధరల జీవోలో ఈ 5వ షో విషయంలో కొన్ని షరతులు విధించింది.


Click it and Unblock the Notifications











