twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : స్వీయనిర్మాణ సంస్థ లక్ష్మీవూపసన్న పిక్చర్స్‌లో నిర్మించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రం విడుదలై నేటితో ఇరవైఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డా॥ మోహన్‌బాబు సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సినిమా అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.

    ''అన్నయ్య ఎన్టీఆర్‌ చేతుల మీదుగా మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ సంస్థ ప్రారంభమైంది. ఆయనతో నేను 'మేజర్‌ చంద్రకాంత్‌'లాంటి ఓ గొప్ప సినిమాని నిర్మించడం మరిచిపోలేని అనుభవం'' అన్నారు ప్రముఖ నటుడు మోహన్‌బాబు. ఆయన నటించి నిర్మించిన చిత్రం 'మేజర్‌ చంద్రకాంత్‌'. ఎన్టీఆర్‌ ముఖ్య భూమిక పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంగళవారంనాటికి ఇరవయ్యేళ్లు పూర్తవుతాయి.

    ఆ సినిమాలో అన్నగారు ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చిందని మోహన్‌బాబు పేర్కొన్నారు. మొదట ఎన్టీఆర్‌ను అన్నగారు అని పిలిచేవాడినని...కాలక్రమంలో అన్నయ్య అని పిలిచేంత సాన్నిహిత్యం ఏర్పడిందని అన్నారు. మిగతా వివరాలు..అరుదైన ఫోటోలతో ..స్లైడ్ షో...

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    ''అన్నయ్య ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'సామ్రాట్‌ అశోక'లో నేనొక చిన్న పాత్ర చేశాను. ఓ రోజు సెట్‌లో ఉన్నప్పుడు 'అన్నయ్యా... నేను మీతో సినిమా నిర్మించాలనుకొంటున్నాను' అన్నాను. ఆ మాట వినగానే పెద్దగా నవ్వుతూ... 'నాతో సినిమా ఏమిటి? మీరు జోక్‌ చేస్తున్నారా?' అన్నారు. 'లేదు నిజంగానే చెబుతున్నాను, రాఘవేంద్రరావుగారు దర్శకుడు' అని చెప్పాను.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    ఆయన రేపు మాట్లాడదాం అని చెప్పి వెళ్లిపోయారు. ఆ రోజు నాకు షూటింగ్‌ లేదు. కానీ సెట్‌కి వెళ్లి ప్రస్తావించాను. 'మొన్న జరిగిన ఎన్నికల్లో నేను గెలవలేదు. ఓడిపోయాను. ఇప్పుడు సినిమా ఏమిటి? ఎవరు చూస్తారు?' అన్నారు.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    'మిమ్మల్నే చూడకపోతే ప్రేక్షకులు ఇంకెవరిని చూస్తారు? మీరు ఊ అనండి. నేను సినిమా తీస్తాను' అన్నాను. అప్పుడు 'సరే కథ తీసుకురండి' అన్నారు. అలా మేజర్‌ చంద్రకాంత్‌కి శ్రీకారం చుట్టాం''.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    ''సినిమా చిత్రీకరణ జరిగిన ప్రతీ క్షణం నాకు గుర్తే. సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే అన్నయ్యకీ, నాకూ మధ్య రెండు విషయాల మీద చర్చ జరిగింది. నాచారం రామకృష్ణ స్టూడియోకి రాఘవేంద్రరావుతో కలిసి ఉదయం 5 గంటలకు వెళ్లాను. 'చెప్పండి బ్రదర్‌' అన్నారు.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    ''అన్నయ్యా... ఎవరైనా సమయానికి రాకపోతే వాళ్లని ఏదైనా అంటుంటాను. అది మిమ్మల్ని అగౌరవపరిచినట్టు కాదు. అలాగే మీరు రాజకీయాల్లో ఉన్నారు. నేను కొద్దిమంది ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని మాత్రమే చూశాను. మీ కోసం ఎవరైనా వస్తే సెట్‌లో వాళ్లని మీరు కలుస్తారా? ముందుగానే ఆ రూల్స్‌ చెప్పండి'' అన్నాను.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    లేదు బ్రదర్‌ షూటింగ్‌కి ఎవర్నీ రానివ్వను. వాళ్లతో సాయంత్రం కానీ, తెల్లవారుజామున కానీ మాట్లాడతాను అని చెప్పారు. ఆ తర్వాత నేను వెంట తీసుకెళ్లిన రూ.25 లక్షలు ఇస్తూ అడ్వాన్సుగా ఇది ఉంచండి అన్నయ్యా అన్నాను.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    ''మేం అడిగామా? మీరు మొదట సినిమా పూర్తి చేయండి'' అని అన్నారు. నేను వినకుండా మళ్లీ ఇవ్వబోయాను. ఆయన కోపంగా 'వద్దని చెబుతున్నాను కదా' అన్నారు. 'లేదు అన్నయ్యా... ఈ రోజు మంచి రోజు. మీరు డబ్బు తీసుకోండి' అన్నాను.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    'మీ చేతికి ఎంతొస్తే అంత ఇవ్వండి' అన్నారు. నేను రెండు చేతులుపెట్టి డబ్బు తీశాను. రెండున్నర లక్షలకంటే ఎక్కువ రాలేదు. అంతే ఆ తర్వాత ఆయన ఎప్పుడూ అడగలేదు. ఆ తర్వాత నేను ఎంతిచ్చాను, ఆయన ఎంత తీసుకొన్నారు అనేది మాకు మాత్రమే తెలుసు''.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    ''చండీగఢ్‌లోని పాలంపూర్‌లో ఎక్కువభాగం షూటింగ్ జరిపాం. నిజమైన సైనికులతో సినిమాని తెరకెక్కించాలనుకొంటున్నామని, మీరు అక్కడకి రావాలని చెప్పాం. ఆయన సరే అన్నారు. పుణ్యభూమి నా దేశం పాటలో నిజమైన సైనికులతో కలిసి అన్నయ్య నటించిన విధానం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఓ నిర్మాతగా ఆయనతో పనిచేసిన ప్రతి రోజూ నాకు ఇప్పటికీ గుర్తే. సెట్‌లో ఆయన ఎంతో సహకరించేవారు.

    ఎన్టీఆర్ 'మేజర్‌ చంద్రకాంత్‌' అనుభవాలు (అరుదైన ఫోటోలు)

    చివరి రోజు అన్నయ్య షూటింగ్‌ చేసి వెళుతుంటే మాకు అందరికీ ఏడుపొచ్చింది. ఇలాంటి క్షణాలు మళ్లీ వస్తాయా? ఈ కథంటే ఆయన ఒప్పుకొన్నారు. ఇలా ఇంకో సినిమా చేస్తారా? అంటూ మేం చాలా బాధపడ్డాం. సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి విజయోత్సవాన్ని నిర్వహించాం అన్నారు.

    English summary
    Sri N.T.Rama Rao and Dr. Mohan Babu teamed up in 1993 for the project ‘Major Chandrakanth’. The film was released 20 years ago on this day and it became a big hit of the year. The film was directed by K.Raghavendra Rao and Mohan Babu produced it. Dr. Mohan Babu spoke to the press on this occasion and he had some interesting things to share.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X