‘జలక్’ ఇవ్వనున్న రింగరింగ పాప!
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'ఆర్య2" చిత్రంలోని 'రింగ రింగా" ఐటమ్ సాంగ్ లో మెరిసి పోయిన విదేశీ సుందరి ఎరిన్ ఆండ్రియా....ఆ పాట ద్వారా చాలా పాపులారిటీ సంపాదించింది. దేశీ శ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఆ పాట యూత్ ను ఓ ఊపు ఊపితే, ఆ పాటకు తగిన వింధంగా అదిరిపోయే స్టెప్పులేసి సాంగ్ సూపర్ హిట్ కావడానికి తన వంతు ప్రయత్నం చేసిన ఆండ్రియా. ఈ పాటను చూసి ఎంతగానో మెచ్చిన సల్మాన్‌ఖాన్ తన చిత్రం 'రెడీ"లో కూడా దేవీశ్రీవూపసాద్‌తో ఈ పాటకు ట్యూన్ చేయించుకున్నాడు. 'ధింక చికా" అంటూ బాలీవుడ్‌లో ఈ పాట మార్మోగిపోయింది. బాలీవుడ్‌లో జరిగే ప్రతి సినిమా కార్యక్షికమంలో ఈ పాటకు నర్తించడం తప్పనిసరైపోయింది.
ఆ పాటయితే సూపర్ హిట్టయింది కానీ...ఆండ్రియా మళ్లీ తెలుగు తెరపై కనిపించ లేదు. మిగతా ఐటం భామల్లా ఈవిడ కూడా సింగ్ ఎంట్రీకే పరిమితం అయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ సుందరి మళ్లీ తెలుగు తెరపై మెరిసేందుకు సిద్ధం అవుతోంది. 'జలక్" చిత్రంలో 'అమ్మాయనుకో ఆంటీ అనుకో" అనే ఐటమ్‌నెంబర్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది. 'రింగరింగా" పాట తనకు ఐటమ్‌గాళ్‌గా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టిందని, తాజాగా 'జలక్" చిత్రంలోని ఈ పాట కూడా అదే స్థాయిలో పేరు తెస్తుందని అంటోంది ఈ భామ.


Click it and Unblock the Notifications











