అందాలు ఎంతవరకైనా చూపించడానికి నేను ఎప్పుడూ రెడీ, కానీ..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Recommended Video

సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ కచ్చితంగా గ్లామర్ గా కనిపించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పలువురు హీరోయిన్లు ఎప్పుడూ ప్రసవిస్తుంటారు. కానీ ఆండ్రియా వంటి హీరోయిన్లు మాత్రం తమ అభిప్రాయాలు చెప్పడంలో ఏమాత్రం వెనుకాడరు. ఆండ్రియా ఈ విషయంలో కొన్ని సార్లు వివాదాల్లో సైతం ఇరుక్కుంది. తాజాగా ఆండ్రియా సినిమాల్లో అందాలు ఆరబోయడం గురించి సంచనల వ్యాఖ్యలు చేసింది. ప్లే బ్యాక్ సింగర్ గా హీరోయిన్ ఆండ్రియా సౌత్ లో రాణిస్తోంది. కానీ ఆండ్రియాకు ఇటీవల అవకాశాలు తగ్గుతున్నాయి.

తమిళ చిత్రాలతో గుర్తింపు
ఆండ్రియా 2005 లో కందా నల్ల ముదల్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టైలిష్ గా కనిపిస్తూ, మంచి నటన కనబరుస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో తడాఖా
తెలుగులో ఆండ్రియా నటించిన చిత్రం తడాఖా. ఆండ్రియా నటించిన మరికొన్ని చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. విశ్వరూపం చిత్రంతో ఆండ్రియాకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల ఆండ్రియా, సిద్ధార్థ్ తో కలసి నటించిన గృహం చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అలాంటి హీరోలతో నటిస్తేనే
ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆండ్రియా సంచనల వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లకు వస్తున్న పాత్రల గురించి ఆమె మాట్లాడారు. ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోల పక్కన నటిస్తేనే వారికి గుర్తింపు వస్తుంది. స్టార్ హీరోల సరసన విలువ లేని పాత్రల్లో అందాలు ఆరబోయ్యల్సిందే అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఆ కోరిక ఉన్న హీరోయిన్లు
నాలాంటి వాళ్ళు మొదటి నుంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలని భావిస్తారు. కానీ అది కుదరడం లేదు. గుర్తింపు రావాలంటే స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో చేయవలసిందేనా అని ఆండ్రియా వాపోయారు.

దీపికా, నయనతార కూడా
ఇప్పుడు సూపర్ స్టార్స్ గా చెప్పుకుంటున్న హీరోయిన్లు దీపికా, నయనతార ఒకప్పుడు ప్రాధాన్యత లేని పాత్రల్లో అందాలు ఒలకబోసి వారే అని అన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన తరువాత వారికి గుర్తింపు లభించిందని, ప్రస్తుతం వారిద్దరూ బలమైన పాత్రలు చేస్తున్నారని అన్నారు.

అందాలు ఆరబోయడానికి నేను రెడీ
అందాలు ఆరబోయడానికి నేను సిద్ధం. కానీ హీరోల పక్కన ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రల్లో కేవలం పాటల్లో మాత్రమ్ కనిపిస్తూ గ్లామర్ షో చేయాలంటే చిరాకు పుడుతోందని అన్నారు. తమ కోసం బలమైన ఉమెన్ స్టోరీలు రాయాలని కోరారు. ఆ పాత్రల్లో అవసరమైతే ఎంతవరకైనా గ్లామర్ షో చేయడానికి సిద్ధం అని అన్నారు. అలా చేస్తే మా గ్లామర్ షో వృధా కాదని ఆండ్రియా తెలిపింది.


Click it and Unblock the Notifications











