‘గుండెల్లో గోదారి’లో ఆండ్రియా జర్మియా ఎంట్రీ
తను పాడిన ఈ పాటకు శ్రోతలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఆమె ఆసక్తిగా ఉన్నారు. ఈ పాట తనకు చాలా ప్రత్యేకం అని ఆండ్రియా అనడానికి కారణం ఇళయరాజా అయ్యుంటుంది. తొలిసారి ఈ మ్యూజిక్ మేస్ట్రో స్వరానికి ఆమె పాడారు. అలాగే సినిమాలో ఈ పాట వచ్చే సందర్భం కూడా చాలా బాగుంటుందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కమలినీముఖర్జి నటించిన తమిళ చిత్రం 'వేట్టయాడు విలైయాడు', తాప్సీ నటించిన 'ఆడుకలమ్', ఇలియానా చేసిన 'నన్బన్' చిత్రాల్లోని వారి పాత్రలకు డబ్బింగ్ చెప్పింది కూడా ఆండ్రియానే.
ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సీ, లక్ష్మీ మంచు కాంబినేషన్‌లో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఈ 'గుండెల్లో గోదారి' చిత్రం రూపొందుతోంది. దివిసీమ ఉప్పెనల నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారు. కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం విడుదలపై నిర్మాత లక్ష్మి మీడియా ప్రకటన చేయనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications












