ఎవరితో పడుకుంటే మీకెందుకు? అది వాళ్ళ వ్యక్తిగతం: ఆండ్రియా సంచలన కామెంట్

సోషల్ మీడియాలో సంచలనంగా మారిన హ్యాష్‌ టాగ్‌ ‘మీ టూ’ పై మీ స్పందనేంటి? అని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ ఆండ్రియా దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది.

Recommended Video

ఎవరితో పడుకుంటే మీకెందుకు?

సోషల్ మీడియాలో సంచలనంగా మారిన హ్యాష్‌ టాగ్‌ 'మీ టూ' పై మీ స్పందనేంటి? అని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ ఆండ్రియా దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. లైంగిక వేదింపులకు తాను వ్యతిరేకం అంటూనే. అమ్మాయిలని బలవంతంగా లైంగిక చర్యలకు లాగటం, అలాగే ఆమె వ్యక్తిగతంగా ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మీరెందుకు ఆ విషయాన్ని మళ్ళీ, మళ్ళీ చూడాలని ప్రయత్నిస్తారు? అంటూ పంచ్ ఇచ్చింది. ఈ తరహా మాటలు బాలీవుడ్ లో కాస్త పర్లేదు గానీ మన దక్షిణాది హీరోయిన్లలో ఇలా చెప్పే ధైర్యం తక్కువే. ఇంతకీ ఆండ్రియా ఏమందో తన మాటల్లోనే...

ఆమె వ్యక్తిగత విషయం

ఆమె వ్యక్తిగత విషయం

‘‘ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరు కూడా. నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం'' అని చెప్పేసింది.

 షాకింగ్ కామెంట్స్

షాకింగ్ కామెంట్స్

ఇటీవల ముద్దు సీన్ల గురించి కూడా ఆమె ఇలానే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దార్థ్ సరసన ‘గృహం' సినిమాలో నటించిన ఆండ్రియా.. ఈ చిత్ర ట్రైలర్లో చూపించిన లిప్ లాక్స్ గురించి మీడియా వాళ్లు ప్రశ్నించినపుడు అదే రకం అసహనం తో తనదైన శైలిలో బదులిచ్చింది."లిప్ లాక్ సీన్స్ గురించి కేవలం మీడియానే ఇంకా విమర్శనాత్మక కోణంలో చూస్తోంది.

 రోడ్డు మీదికి వచ్చి చూడండి

రోడ్డు మీదికి వచ్చి చూడండి

ఒకసారి రోడ్డు మీదికి వచ్చి చూడండి.. ఈ కాలం యువత ఇలాంటి వాటిని చాలా సహజంగా భావిస్తోంది. లిప్ లాక్ అశ్లీలం, అసభ్యం అనే వాళ్లందరూ నిజ జీవితంలో ముద్దులే పెట్టుకోవట్లేదా? లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని.. దాని గురించి మాట్లాడటం పాత పంచాంగం లాంటి విషయం'' అంటూ కోపాన్ని అనుచుకుంటున్న రీతిలో గట్టిగానే క్లాస్ తీసుకుంది ఈ యాంగ్రీ హాట్ హీరోయిన్.

 విశాల్ ‘డిటెక్టివ్'

విశాల్ ‘డిటెక్టివ్'

విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్' చిత్రంలో నటించిన ఆమె సినిమా గురించి కూడా ముచ్చట్లు చెప్పారు. డిటెక్టివ్ ఒక థ్రిల్లింగ్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 10న విడుదల కానుంది. ఇందులో ఆండ్రియా గ్రే షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. ఆ పాత్ర కోసం ఆమె కొన్ని యాక్షన్ సీన్లు కూడా చాలా కష్టపడి చేసిందట. సినిమా కోసం హార్లీ డేవిడ్ సన్ బైక్ నడపడం కూడా నేర్చుకుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X