గృహ హింస నుంచి కాపాడండి.. వేధింపులు భరించలేకపోతున్నా.. శ్రీయపై భర్త అండ్రూ ఫిర్యాదు
ఇది నిజం అనుకొంటే పొరపాటే. లాక్‌డౌన్ పిరియడ్‌లో అందాల తార శ్రీయ దంపతుల రొమాంటిక్ గొడవ ఇది. చిలిపి ఆటలతో ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధాన్ని బాగా ఎంజాయ్ వారు చేస్తున్నారు. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ కొనసాగడంతో షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న శ్రీయ సరన్ ప్రస్తుతం గృహస్థ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా పెట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి. వారిద్దరి చిలిపి తగదాలు మీరే చూడండి..

లాక్‌డౌన్‌లో శ్రీయ సరన్
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ భయాందోళనలు నెలకొనడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ఈ పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ శ్రీయా సరన్ భర్త అండ్రూ కొశ్చివ్‌తో రష్యాలో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆట విడుపులో భాగంగా వారిద్దరు చిలిపి ఆటలతో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో శ్రీయపై భర్త ఆండ్రూ ఫిర్యాదు చేయడం ఫన్నీగా మారింది.
నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకొన్నానంటే
టిక్ టాక్ యాప్‌లో తాజాగా ఓ వీడియోను శ్రీయ పోస్టు చేసింది. నేను నా భర్త ఆండ్రూ కొశ్చీవ్‌ను ఎందుకు పెళ్లి చేసుకొన్నానో తెలుసా? ఇలా గిన్నెలు తోయించడానికే. మా ఆయన ఇలా గిన్నెలు కడుగుతున్నాడు. మీరు మీ భర్తలను ఇలానే వంట గిన్నెలను తోమించే పనిచేయాలని నా ఫ్రెండ్స్, అభిమానులు, సన్నిహితులకు సవాల్ విసిరుతున్నాను అని శ్రీయ పేర్కొన్నారు.

నసను భరించలేకపోతున్నా
మరో వీడియోను పోస్టు చేసిన శ్రీయ.. సోషల్ డిస్టెన్స్‌ను పాటించండి అంటూ ప్లకార్డు ప్రదర్శించింది. దానికి జవాబుగా భర్త మరో ప్లకార్డును చూపిస్తూ.. నాన్‌స్టాప్‌గా మాట్లాడుతున్నది. ఆమె నసను భరించలేకపోతున్నాను అని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మరో ప్లకార్డును శ్రీయ చూపిస్తూ థ్యాంక్ యూ. నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని చూపించారు. దానికి జవాబుగా నన్ను ప్రతీ రోజు ఎడతెరిపి లేకుండా పనిచేయిస్తుంది అని భర్త కార్డు చూపించారు.
Recommended Video
నన్ను ఆమె నుంచి కాపాడండి
కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకొంటూ ఇంటి వద్దనే ఉండండి. కోవిడ్ 19ను తరిమి కొట్టండి అంటూ మరో ప్లకార్డును చూపిస్తే.. దానికి ఆమె నుంచి నన్ను కాపాడండి. నన్ను బయటపడేసేలా ప్రార్థించండి అంటూ భర్త మరో కామెంట్‌ను చూపించాడు. ఇలా ప్లకార్డును చూపిస్తూ చిలిపి ఆటలు ఆడుతూ అభిమానులకు వినోదాన్ని పంచారు.


Click it and Unblock the Notifications











