Naniకి ఊహించని షాక్.. వివాదంలో దసరా.. ఆ సీన్లు తొలగించాలని థియేటర్ల ముందు ధర్నా!
సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుకు పెట్టిన నాని అనంతరం హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పక్కింటి కుర్రాడి వంటి పాత్రలతో నేచురల్ స్టార్ అయ్యాడు. ఇక ఇటీవల నాని నటించి లేటెస్ట్ మూవీ దసరా. మార్చి 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ క్రమంలో అందులోని కొన్ని సీన్లు తొలగించాలంటూ వివాదం నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..

ధరణిగా నాని..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గతేడాది హీరోగా అంటే సుందరానికి సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. అలాగే నిర్మాతగా మారిన ఆయన నూతన దర్శకులను పరిచయం చేస్తున్నాడు. నిర్మాతగా గతేడాది హిట్ 2 సినిమాతో మంచి హిట్టు కొట్టాడు నాని. తాజాగా హీరోగా దసరా మూవీతో మరో హిట్ కొట్టాడు. ఇందులో ధరణిగా పాత్రలో కనిపించిన నాని మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో వెన్నెల అనే పాత్రలో అదరగొట్టింది.

సాంకేతిక వర్గం..
న్యూ టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేశాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించారు.

రగ్గడ్ గా నాని.. దీక్షిత్ అలా..
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మించిన ఈ దసరా సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని రగ్గడ్ లుక్ లో కనిపించగా మరో హీరోగా దీక్షిత్ ఆకట్టుకున్నాడు.

చిరు, బాలయ్య సినిమాలకు మించి..
తెలంగాణలోని సింగరేణి ఏరియా కథతో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. మార్చి 30న పాన్ ఇండియా చిత్రంగా వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమాకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఫలితంగా మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకు మించి తొలి రోజు ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించింది.

క్షమాపణలు చెప్పాలని..
అత్యధిక కలెక్షన్లతో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దసరా. అయితే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుక్కుంది. ఈ సినిమాలో తమను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించడంతోపాటు దసరా చిత్ర బృందం తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా ఆదిలాబాద్ తదితర చోట్ల థియేటర్ల ముందు ధర్నాకు దిగారు అంగన్ వాడీ కార్యకర్తలు.

అలాంటి సీన్లపై అభ్యంతరం..
అయితే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో మహానటి కీర్తి సురేష్ వెన్నెల అనే అంగన్ వాడీ టీచర్ పాత్ర పోషించింది. ఇందులో ఒకానొక సమయంలో పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను వెన్నెల అనే పాత్ర అమ్ముకుంటుంది. అంతేకాకుండా, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇస్తుంది. ఇప్పుడు ఈ సన్నివేశాల మీద అంగన్ వాడీ కార్యకర్తలు అభ్యంతరం తెలియజేస్తూ ధర్నాకు దిగారు. మరి ఈ విషయంపై దసరా టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











