twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి సినిమా గుర్తొస్తోంది: రాజమౌళి శిష్యుడి మూవీ ఇది...

    ఏంజల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రంలో నాగ అన్వేష్, హెబ్బ పటేల్ హీరో హీరోయిన్లు.

    By Bojja Kumar
    |

    మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'జగదేక వీరుడు-అతిలోక సుందరి' సినిమా గుర్తుందా? ఈ సినిమాలో దేవ లోకం నుండి భూలోకానికి వచ్చిన దేవకన్యగా శ్రీదేవి నటించింది.

    త్వరలో తెలుగులో విడుదల కాబోతున్న 'ఏంజల్' సినిమా ట్రైలర్ చూస్తే ఆ సినిమా గుర్తొస్తోందని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ట్రైలర్లో ఆ పాయింట్ ఒక్కటే 'జగదేక వీరుడు-అతిలోక సుందరి' సినిమాతో మ్యాచ్ అయినట్లు కనిపిస్తోంది. అయితే సినిమా కథ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

    రాజమౌళి శిష్యుడు పళని

    రాజమౌళి శిష్యుడు పళని

    నాగ అన్వేష్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏంజెల్‌'. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమౌళి శిష్యుడు పళని. సరస్వతి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భువన్‌ సాగర్‌ నిర్మించారు.

    అదిరిపోయే గ్రాఫిక్స్

    అదిరిపోయే గ్రాఫిక్స్

    దాదాపు 40 నిమిషాలకి పైగా గ్రాఫిక్స్‌ హంగులతో రెడీ అవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకి విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఆగస్టు 7న చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేసారు.

    బాహుబలి పళని

    బాహుబలి పళని

    ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని, తెలుగుతో పాటు తమిళంలో కూడా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పళని తెలిపారు. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్స్‌లో బిజీగా ఉన్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా చెప్పారు.

    స్టోరీ ఇదే

    జీవితం చాలా చిన్నది. త్వరగా సంపాదించి బాగా ఎంజాయ్‌ చేయాలని భావించే హీరో, సరిగ్గా అలాంటి భావాలు కలిగిన అతని స్నేహితుడి మధ్య కలలో కూడా ఊహించని విధంగా ఒక యువతి వచ్చి చేరుతుంది. తను కూడా ఈ భూమిపై ఉన్న అన్ని సంతోషాలను అనుభవించాలని కోరుకుంటుంది. అలాంటి ఈ ముగ్గురూ అనూహ్యంగా ఒక ఆపదలో చిక్కుకుంటారు... దాని నుండి వారు ఎలా బయట పడ్డారు అనేది తర్వాతి కథ.

    English summary
    Angel Telugu Movie Trailer released. Naga Anvesh, Hebah Patel, and Sapthagiri playing leasd roles, Directed by Baahubali K. Palani. Produced by Bhuvan Sagar. Music composed by Bheems Ceciroleo. Cinematography by Guna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X