ద్రౌపది పాత్రలో నటించనున్న హాలీవుడ్ హీరోయిన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజలీనా జోలీ త్వరలో ద్రౌపదిగా కనిపించే అవకాశముంది. రాజనీతి చిత్రం రూపొందించిన ప్రకాష్ ఝా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయునున్నాడు. రాజనీతి విజయంతో ఆయన ఈ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. భారతంలో ద్రౌపది పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కథనం నడుస్తుంది. మొదట ఈ పాత్రకోసం మాధురీ దీక్షిత్ ని అనకున్నారు. కానీ ఇంటర్నేషనల్ స్ధాయిలో ఈ చిత్రాన్ని నిర్మించి రిలీజ్ చేయాలనే నిర్మాతల కోరిక మేరకు ఆయన హీరోయిన్ ని మార్చారు. అయితే ఏంజలీనా జోలీ మాత్రం ఈ చిత్రంలో నటిస్తుందా లేదా అన్నది నిర్ణయం తెలపలేదు. కానీ చేసే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. ఇక బిపాసాబసు ప్రస్తుతం రితూపర్ణఘోష్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో ద్రౌపది పాత్ర పోషిస్తోంది. ప్రకాష్ ఝా చిత్రం కనుక ఓకే అయితే ఏంజలీనా జోలీకి బిపాసాకు మధ్య పోటీ ఉంటుందన్నమాట. ఇక ఈ చిత్రాన్ని ప్రకాష్ ఝా అల్టిమేట్ ట్రిబ్యూట్ టు ఉమెన్ హుడ్ గా పేర్కొంటున్నాడు.


Click it and Unblock the Notifications











