భర్తకు 18 కోట్ల విలువైన గిఫ్టు ఇచ్చిన హీరోయిన్!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజెలీనా జోలీ ఇటీవలే తన ప్రియుడు బ్రాండ్ పిట్‌ను గత నెల పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన భర్త కోసం అరుదైన, ఖరీదైన వాచీని బహుమతిగా ఇచ్చింది. 1952లో స్విట్జర్లాండ్‌లో తయారైన పాటెక్ ఫిలిప్పె ప్లాటినమ్ క్రోనోమీటర్ వాచీని భర్తకు బహూకరించింది.
దాదాపు ఏడెనిమిదేళ్లుగా సహజీవనం అనంతరం హాలీవుడ్ సెక్సీ జోడీ బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ పెళ్లి చేసుకున్నారు. దంపతులయ్యారు. 2005 నుండి కలిసి సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరూ 2012లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్రాన్స్‌లో వీరి వివాహం జరిగింది.

ఈ ఏడేళ్ల సహజీవనంలో ఈ జంట ముగ్గు పిల్లలకు జన్మనివ్వగా...మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. హాలీవుడ్ హాట్ జోడీ అయిన బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలిలను కలిపి......ముద్దుగా 'బ్రాంజలీనా' అని పిలుచుకుంటారు అభిమానులు. మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు.
2005లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిస్టర్స్ స్మిత్' చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ప్రేమలో పడి పోయాడు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ.....ఒకరి కోరికలను మరొరు ఆస్వాదిస్తూ చూడముచ్చటైన ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











