Butta Bomma Twitter Review: బుట్టబొమ్మకు ఊహించని టాక్.. అదొక్కటే నిరాశ.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రీమేక్ మూవీలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వేరే భాషల్లో విడుదలై భారీ విజయాలను అందుకున్న చిత్రాలను మన వాళ్లు అస్సలు వదిలిపెట్టడం లేదు. అలా ఇప్పుడు మలయాళంలో హిట్‌గా నిలిచి 'కప్పేల'ను తెలుగులోకి 'బుట్టబొమ్మ' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. తద్వారా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'బుట్టబొమ్మ' మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో ఓ లుక్కేద్దాం వచ్చేయండి మరి!

బుట్టబొమ్మతో కలిసి వచ్చేశారు

బుట్టబొమ్మతో కలిసి వచ్చేశారు

అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే 'బుట్టబొమ్మ'. శౌరీ చంద్రశేఖర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నవ్య స్వామీ, పుష్ప జగదీష్ తదితరులు నటించారు.

అలాంటి కథతో వచ్చిన మూవీ

అలాంటి కథతో వచ్చిన మూవీ

అరకులో ఓ అమ్మాయికి తండ్రి అంటే భయం. ఫోన్‌లో పరిచయమైన అబ్బాయితో దొంగతనంగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడతారు. ఆ తర్వాత కలిసి తిరుగుతారు. తర్వాత ఇద్దరూ కలిసి పారిపోతారు. అలా వెళ్లిన వాళ్లు ఎలాంటి కష్టాలను అనుభవించారు అనే కథతో 'బుట్టబొమ్మ' మూవీ తెరకెక్కింది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

బుట్టబొమ్మకు ట్విట్టర్‌లో టాక్

విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న 'బుట్టబొమ్మ' మూవీ ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వచ్చింది. ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఈ సినిమా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అస్సలు మిస్ అవకండని

'బుట్టబొమ్మ' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో 'బుట్టబొమ్మ మూవీ ఎంతో ప్రభావవంతమైన కథతో వచ్చింది. దాన్ని చూపించిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా విజువల్స్, పల్లెటూరి వాతావరణం, భావోద్వేగాలు, భయాలు బాగా చూపించారు. అనిఖా, సూర్య నటన బాగుంది. అర్జున్ తన గొంతుతో ఇరదీశాడు. ఈ మూవీ మిస్ కాకండి' అని చెప్పాడు.

అనిఖా మాయ చేసిందని

ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందిన 'బుట్టబొమ్మ' మూవీని చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయం చెప్పాడు. అందులో 'బుట్టబొమ్మ మూవీ చాలా బాగుంది. అనిఖా సురేంద్రన్ తన అందంతో తెరపై ఎంతో క్యూట్‌గా కనిపించింది. అర్జున్ దాస్ యాక్టింగ్ అదిరిపోయింది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ మంచి సినిమా ఇది' అంటూ చెప్పుకొచ్చాడు.

వాళ్లిద్దరినే హైలైట్ చేస్తూ

పక్కా పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో స్వచ్చమైన ప్రేమకథతో రూపొందిన 'బుట్టబొమ్మ' మూవీని వీక్షించిన మరొక నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా స్పందించాడు. 'బుట్టబొమ్మ మూవీ చూశాను. ఇది కప్పెలకు అత్యుత్తమమైన రీమేక్ అని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా అర్జున్ దాస్, అనిఖా సురేంద్రన్ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు' అంటూ వివరించాడు.

మంచి ప్రయత్నం అంటూ

మంచి ప్రయత్నం అంటూ

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన 'బుట్టబొమ్మ' సినిమాను చూసిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్‌ ద్వారా అభిప్రాయాన్ని వెల్లడించారు. అందులో 'బుట్టబొమ్మ డీసెంట్‌గా సాగే నమ్మకమైన రీమేక్. ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్ తన పాత్రతో బాగా హైలైట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రానికి అర్జున్ దాస్ ఒక అస్సెట్ అని చెప్పొచ్చు. నా రేటింగ్ 2.75/5' అని వెల్లడించాడు.

అదే నిరాశ అంటూ కొందరు

అదే నిరాశ అంటూ కొందరు


ఇప్పటి వరకూ 'బుట్టబొమ్మ' మూవీ గురించి చూసిన ట్వీట్లలో చాలా వరకూ పాజిటివ్‌గానే ఉన్నాయి. అయితే, మరికొన్నింటిలో మాత్రం ఈ సినిమాను ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడని కామెంట్లు కనిపించాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ సోసోగా సాగిందని, సెకెండాఫ్ బాగున్నా ఇంకాస్త బెటర్‌గా చూపించొచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పోస్టులు కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X