twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని సరసన హీరోయిన్ గా వాణి కపూర్ (ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : చిన్న సినిమాలతో పెద్ద హీరోగా మారిన నాని తాజాగా కమిటైన చిత్రం బ్యాండ్ బజా భరాత్ రీమేక్. ఈ చిత్రంలో నాని సరసన వాణి కపూర్ అనే కొత్త అమ్మాయి చేయనుంది. హిందీలో సూపర్ హిట్ చిత్రం 'బ్యాండ్‌ బాజా బారాత్‌'. ఈ సినిమాను దక్షిణాది భాషల్లో పునర్‌ నిర్మిస్తోంది యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ. ఇందులో హీరోగా నాని నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. గోకుల్‌కృష్ణ దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందిస్తారు. దాన్ని తెలుగులోకి డబ్ చేస్తారని సమాచారం.

    ఇక ఇదే సబ్జెక్టుతో రొమాంటిక్ ఎంటర్టైనర్ 'జబర్‌దస్త్' ఆ మధ్యన విడుదలై ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది . ఈ విషయమై నాని స్పందిస్తూ.. " నేను చేస్తున్న సినిమా ఆల్రెడీ మొదలైంది. తెలుగు,తమిళ భాషల్లో విడుదల అవుతుంది. ," ఖరారు చేసారు. అలాగే... బ్యాండ్ బాజా బారాత్ ప్రిమైజ్, జబర్దస్త్ ప్రిమైజ్ ఒకటే అంటున్నారు అని అడగగా.. "నేను ఇప్పటివరకూ ఆ సినిమాని చూడలేదు. అయితే చాలా మంది హిందీ సినిమాలాంటి సిమిలర్ కథ అంటున్నారు... .", అయితే ఏమన్నా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాసం ఉంటుందంటారా అంటే.. " నేను ప్రొడ్యూసర్ కాదుగా అని తేల్చేసారు..

    మరో ప్రక్క దర్శకురాలు నందినీరెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ... "నేను బ్యాండ్ బజా బారత్ కి మా సినిమాకు పోలిక ఉంటుందనుకోలేదు.. అలాగే మా సినిమాలో హీరో,హీరోయిన్స్ ఈవెంట్ మేనేజర్స్ మాత్రమే...వెడ్డింగ్ ప్లానర్స్ కాదు. వారు ప్రెషర్స్ పార్టీలు, కార్పోరేట్ పంక్షన్స్, షష్టిపూర్తి ఉత్సవాలు వంటివి కూడా చేస్తారు. అంతేకాదు మేము మా సినిమాకు తీసుకున్న కంపెనీ కూడా ఈవెంట్ మేనేజమెంట్ కంపెనీ...నేను ఈవెంట్ మేనేజ్ మెంట్ ని మా సినిమా కు బ్యాక్ డ్రాప్ గా తీసుకోవటానికి కారణం...సినిమాకు కొత్త కలర్,లుక్ వస్తుందని మాత్రమే ..అయినా వెడ్డింగ్ ప్లానర్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా హాలీవుడ్ చిత్రాలు వచ్చాయి...అని తేల్చి చెప్పారు.

    అంతేకాదు తాను చాలా దాదాపు 23 సినిమాల నుంచి ప్రభావితురాలునయ్యానని అన్నారు. క్లైమాక్స్ సీన్ ని ..జానే బీ దో యారో నుంచి తీసుకున్నాను. అలాగే అమితాబ్ ..యారానా లో కొన్ని సీన్స్, డేవిడ్ ధావన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ని నేను ఈ సినిమాలో ఫాలో అయ్యాను అని చెప్పుకొచ్చారు.

    English summary
    Nani is gearing up to do the remake of Hindi hit, Band Bajaa Baaraat.Newcomer Gokul Krishna is directing the film, while Vani Kapoor is cast opposite Nani in the film. Vani Kapoor is making debut in soon-to-be released Hindi film, Shuddh Desi Romance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X