twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది చివరి వరకూ ఉత్కంఠే.. ‘ఎఫ్3’పై డైరెక్టర్ కామెంట్స్.. అవన్నీ రూమర్సేనా..?

    |

    సంక్రాంతి సీజన్‌లో బరిలోకి దిగి స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. గతేడాది సంక్రాంతి బరిలోకి దిగిన ఎఫ్2 దాదాపు వంద కోట్ల వసూళ్లను కొల్లగిట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి చిత్రాలు పోటీలో ఉన్నా.. రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇంతటి ఘన విజయాన్నిఅందించిన దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు చిత్ర సీమలో మార్మోగిపోయింది.

    ఛాన్స్ ఇచ్చిన మహేష్..

    ఛాన్స్ ఇచ్చిన మహేష్..

    ఎఫ్2 చిత్రంతో వంద కోట్ల దర్శకుడిగా అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు మీడియం రేంజ్‌ హీరోలతో సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించే.. అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేష్ బాబు అవకాశమిచ్చాడు. ఆ ఛాన్స్‌ను ఉపయోగించుకున్న అనిల్ ఈ సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్‌ను ఇచ్చాడు.

    మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

    మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

    స్టార్ డైరెక్టర్‌ను చేసిన మహేష్ బాబును, ఆయన నమ్మకాన్ని అనిల్ రావిపూడి నిలబెట్టుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందించడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇదివరకెన్నడూ చూడని మహేష్ బాబును చూపించడంతో సగటు ప్రేక్షకుడు సైతం సినిమాను మెచ్చుకున్నారు.

    ప్రస్తుతం ఎఫ్ 3 పనుల్లో..

    ప్రస్తుతం ఎఫ్ 3 పనుల్లో..

    అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీకి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. తాను మామూలుగా స్క్రిప్ట్‌ను వైజాగ్‌లో రాస్తానని, అయితే కరోనా విజృంభించడంతో ఇంట్లోనే రాసుకుంటున్నానని తెలిపాడు.

    మూడో హీరోపై రూమర్స్..

    మూడో హీరోపై రూమర్స్..

    ఎఫ్3 లో మూడో హీరో ఉంటాడని, ఆ క్యారెక్టర్‌కు మహేష్ బాబు, రవితేజ వంటివారి పేర్లను పరిశీలిస్తున్నారని రూమర్స్ వినిపించాయి. అదే విషయంపై క్లారిటీ ఇస్తూ.. ఇంకా అలాంటిదేమీ అనుకోలేదని ఒకవేళ సెకండాఫ్‌లో మూడో హీరోకు స్కోప్ ఉంటుందేమో చూడాలి.. అది మక్కూడా చివరి వరకు ఉత్కంఠలానే ఉందని అనిల్ రావిపూడి తెలిపాడు. దీంతో మహేష్ బాబు, రవితేజలపై వచ్చిన వార్తలు వట్టి రూమర్సేనని తేలిపోయాయి.

    English summary
    Anil Ravipudi About F3 movie And Third Hero. According To Director There Is No Scope For Third Hero. He Says That may Be Any Chance In Second Half But It Is Not SUre.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X