ఆ కథ రామ్ కోసమే.. కానీ మిస్ అయింది.. త్వరలోనే అంటూ అనిల్ రావిపూడి కామెంట్స్
ఒక్కోసారి ఒక్కో హీరోకు రాసుకున్న కథను మరో హీరోతో చేయాల్సి ఉంటుంది. కథ ప్రారంభంలో ఎవరినో అనుకుని చివరకు ఇంకెవరో వస్తుంటారు. అలా రామ్ కోసం అనుకున్న కథలో వేరే హీరో వచ్చాడు. తాజాగా ఈ విషయం గురించి అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రాజా ది గ్రేట్ సినిమా చర్చల్లోకి వచ్చింది. అనిల్ రావిపూడి ఆలీతో సరదాగా షోలో గెస్ట్‌గా వచ్చాడు. గాలి సంపత్ ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

గాలి సంపత్ అలా..
కథ కథనం దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణ ఇలా గాలిసంపత్ కోసం అనిల్ రావిపూడి చేయాల్సిందంతా చేసేశాడు. కానీ గాలి సంపత్ మాత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన రెండు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

అనిల్ రావిపూడి కామెంట్స్..
అయితే అనిల్ రావిపూడి తన గాలి సంపత్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా అనుకున్నప్పుడు లాభం వస్తుందా? లేదా? లెక్కలు వేసుకుని చేయలేదని అన్నాడు. తన ఫ్రెండ్ రాసిన కథకు న్యాయం చేయాలని అనుకున్నానని తెలిపాడు.

రాజా ది గ్రేట్ కథ..
మొదట రామ్‌ని ఊహించుకునే రాజా ది గ్రేట్ కథ రాసుకున్నా. కానీ ఎందుకో ఆ తర్వాత మా కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. ఎందుకుంటే అప్పటకే రామ్ 'హైపర్'కి తోడు మరో సినిమాలో యాక్షన్ ప్రధానంగా నటించారు. మళ్లీ అదే జోనర్‌లో కాకుండా కాస్త విభిన్నంగా చేయాలనుకున్నాడు. అందుకే ఆ సినిమా ఆగిపోయింది. తప్పనిసరిగా త్వరలో రామ్‌తో సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి అన్నాడు.

రూమర్లు వచ్చాయ్..
రామ్ తన రెడ్ సినిమాతో సంక్రాంతి బరిలో దుమ్ములేపాడు. రెడ్ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే సినిమా ఉంటుందని రూమర్లు వచ్చాయి. కానీ లింగుస్వామితో కలిసి రామ్ ద్విభాషా చిత్రాన్ని ప్రకటించేశాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











