మహేష్ బాబు మూవీతో రీ ఎంట్రీ... తొలిసారి స్పందించిన విజయశాంతి!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజ(మే 31)న లాంచ్ అయింది. ఈ సందర్భంగా తొలిసారి విజయశాంతి స్పందించారు. ఆమె పంపిన లేఖను దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాకు చదివి వినిపించారు.

అపుడు కృష్ణ గారు, ఇపుడు మహేష్ బాబు
‘‘సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ‘కిలాడి కృష్ణుడు' సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. 180 సినిమాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.'' అని విజయశాంతి తెలిపారు.

బాధ్యతగా స్వీకరిస్తాను
సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇటు వైపు రావడానికి భగవంతుడి సంకల్పం లేదా ప్రజల అభిమాన బలం కారణం అయి ఉంటుంది. తనకు లభించిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నట్లు విజయశాంతి తెలిపారు.

ఇప్పటికీ అంకింత భావం ఉంది
సినిమాల పట్ల తనకు ఇప్పటికీ అంకితభావం ఉందని, వృత్తి పట్ల గౌరవం ఉందని ఈ సందర్భంగా విజయశాంతి తెలిపారు. చాలా కాలం తర్వాత మళ్లీ ప్రజల ముందుకు సినిమా ద్వారా రావడం ఆనందంగా ఉందని విజయశాంతి తెలిపారు.
థాంక్స్ చెప్పిన అనిల్ రావిపూడి
13 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సబ్జెక్ట్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు ఆవిడకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో జగపతి బాబు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు.

భారీ రెమ్యూనరేషన్
ఈ సినిమా కోసం విజయశాంతి రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమెతోనే ఆ పాత్రను చేయించాలని నిర్మాతలు భావించడం వలన.. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించారట. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











