twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కల్యాణ్ రామ్‌పై అనిల్ రావిపూడి కామెంట్స్.. ఆ రోజున ఆయన అలా చేయడంతో!

    |

    ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి టైమ్ నడుస్తోంది. వరుస విజయాలతో దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. గతేడాది ఎఫ్ 2 సినిమాతో సంక్రాంతి సక్సెస్ సాధించిన అనిల్.. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి సంక్రాంతి సక్సెస్ అందుకున్నారు. వరుస హిట్స్ పట్టేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఈ డైరెక్టర్ టాలెంట్ చూసి సీనియర్ డైరెక్టర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అనిల్ రావిపూడి.. తనకి తొలిసారిగా అవకాశం ఇచ్చిన హీరో కల్యాణ్ రామ్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. ఎవ్వరూ అవకాశం ఇవ్వని సమయంలో కల్యాణ్ రామ్ తనకు అవకాశం ఇచ్చి తన కెరీర్ లో కీలక భూమిక పోషించాడని అన్నాడు.

    Anil Ravipudi comments on Nandamuri Kalyan Ram

    "నేను 'పటాస్' కథను సిద్ధం చేసుకుని హీరోలచుట్టూ, నిర్మాతల చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను కల్యాణ్ రామ్ కలవగా.. తను హీరోగా చేయడానికి ఓకే అన్నారు. కానీ అప్పటికే నిర్మాతగా 'ఓమ్' సినిమాతో దెబ్బతిని ఉండటం వలన తన బ్యానర్లో చేయలేనని చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరం కలిసి నిర్మాతల కోసం తిరిగాం కానీ అదీ సక్సెస్ కాలేదు. చివరికు కల్యాణ్ రామ్ రిస్క్ తీసుకుని తానే స్వయంగా నిర్మించారు. ఆ రోజున ఆయన అలా చేయడం వల్లనే ఈ రోజున నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను" అని చెప్పాడు అనిల్ రావిపూడి.

    ఇటీవలే అనిల్ రావిపూడి రూపొందించిన సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ఆ చిత్రయూనిట్ మొత్తానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. మహేష్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా ఈ సినిమా పలు రికార్డులు తిరగరాస్తోంది.

    English summary
    Mahesh Babu's new project with Anil Ravipudi as SariLeru Neekevvaru. Now he says about Nandamuri Kalyan Ram in an interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X