For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోక్షజ్ఞ ఎంట్రీపై అనిల్ రావిపూడి క్లారిటీ: ఇప్పుడదే పనిలో.. బాలయ్య ప్లాన్‌ అంటూ మేటర్ లీక్

  |

  చాలా ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఒకటి. ఈ నట వారసుడు త్వరలోనే టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయబోతున్నాడని, ఫలానా దర్శకుడు అతడిని లాంఛ్ చేయనున్నాడని ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే బాలయ్య కూడా తన కొడుకు ఎంట్రీపై తరచూ ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో ఈ న్యూస్ తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది. ఫలితంగా అతడి రాక కోసం అభిమానులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ఆ విశేషాలేంటో మీరే చూడండి!

  బాలకృష్ణ ప్రకటనతో వెలుగులోకి

  బాలకృష్ణ ప్రకటనతో వెలుగులోకి

  నందమూరి తారక రామారావు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా హీరోగా లాంఛ్ అవుతాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ కుర్రాడి రాక కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

  బ్రాతో రెచ్చిపోయిన సమంత: అదొక్కటి అడ్డు లేకుంటే ఇక అంతే!

  అలాంటి ఫొటోలు.. ఫ్యాన్స్ నిరాశ

  అలాంటి ఫొటోలు.. ఫ్యాన్స్ నిరాశ

  కొంత కాలంగా నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. రేపో మాపో అతడు ముఖానికి మేకప్ వేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోక్షజ్ఞ మాత్రం ఫ్యాట్ లుక్‌తోనే దర్శనమిస్తున్నాడు. ఇటీవలే అతడి ఫొటోలు బయటకు రాగా.. అందులో ఈ నందమూరి చిన్నోడు బొద్దుగా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోతున్నారు.

  మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్లాన్స్ చేసి

  మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్లాన్స్ చేసి


  నందమూరి బాలకృష్ణ తన కుమారుడి సినీ రంగ ప్రవేశం గురించి స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పదే పదే అతడి ఎంట్రీ గురించి కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా తెర ముందు జరిగితే.. తెర వెనుక మాత్రం మోక్షజ్ఞ లుక్‌ను మార్చేందుకు పర్సనల్ ట్రైనర్లను, నటనలో మెళకువలకు గురువులను తీసుకొచ్చి కొడుకును లాంచింగ్ కోసం రెడీ చేస్తున్నారట.

  ప్రెగ్నెంట్ అయినా తగ్గని హీరోయిన్: హాట్ సెల్ఫీలో ఎద అందాల ఆరబోత

  ఆ దర్శకులందరి పేర్లు వైరల్‌గా

  ఆ దర్శకులందరి పేర్లు వైరల్‌గా

  మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను బాలయ్య.. దర్శకధీరుడు రాజమౌళి చేతిలో పెట్టాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. అంతేకాదు.. తన శిష్యుడితో అతడిని లాంచ్ చేయాలని జక్కన్న కూడా భావించినట్లు వార్తలు వచ్చాయి. దీని తర్వాత పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్ సహా ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

  ఎంట్రీపై అనిల్ రావిపూడి క్లారిటీ

  ఎంట్రీపై అనిల్ రావిపూడి క్లారిటీ

  త్వరలోనే నందమూరి బాలకృష్ణతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌లో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ యంగ్ డైరెక్టర్‌కు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో అనిల్ రావిపూడి దీనిపై స్పందించడంతో పాటు క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

  షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన దీప్తి సునైనా: ఎద అందాలు ఆరబోస్తూ యమ హాట్‌గా!

  ఇప్పుడు అదే పనిలో ఉన్నాను

  ఇప్పుడు అదే పనిలో ఉన్నాను

  నందమూరి మోక్షజ్ఞను తాను లాంచ్ చేయబోతున్నానని వస్తున్న వార్తలపై అనిల్ రావిపూడి స్పందిస్తూ.. 'ఈ వార్త నా వరకూ వచ్చింది. బయట కూడా ఈ విషయం బాగా ప్రచారం జరుగుతోంది. కానీ, బాలయ్య గారు నాతో దీని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు ఈ ప్రస్తావనే రాలేదు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం బాలయ్య గారితో చేసే సినిమాపైనే ఉంది' అంటూ వివరించాడు.

  బాలయ్య ప్లాన్ నాకు తెలీదంటూ

  బాలయ్య ప్లాన్ నాకు తెలీదంటూ

  నందమూరి మోక్షజ్ఞను పరిచయం చేసే అవకాశం వస్తే చేస్తానని అనిల్ రావిపూడి అన్నాడు. 'ఇప్పటి వరకూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య గారు మాట్లాడలేదు. ఒకవేళ ఆయన పరిచయం చేయమంటే కచ్చితంగా చేస్తాను. కానీ, బాలయ్య గారు ఎలాంటి ప్లాన్‌లో ఉన్నారో తెలీదు' అని చెప్పుకొచ్చాడు. ఇలా పరోక్షంగా నటసింహం తన కొడుకు ఎంట్రీని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు.

  English summary
  Nandamuri Balakrishna Son Mokshagna Will Debut to Tollywood Very Soon. Now Star Director Anil Ravipudi Did Comments on Nandamuri Mokshagna Debut.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X