మహేష్ బాబు సొంత నిర్మాణంలో.. అనిల్ రావిపూడితో కమిటయ్యాడు!
సూపర్ స్టార్ మహేష్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తాడు. అందుకే మహేష్ కు కథ చెప్పి ఒప్పించడానికి చాలా మంది దర్శకులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. మహేష్ మాత్రం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మహర్షి చిత్రంలో వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. ఆ తదుపరి మహేష్ సినిమా గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి కథావినిపించగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తన చిత్రాల విషయంలో భాగస్వామిగా మాత్రమే ఉంటున్నాడు. ఇకపై పూర్తి స్థాయిలో నిర్మాణ రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో 14 రీల్స్ నిర్మాతలు కూడా భాగస్వాములుగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి వరుస నాలుగు విజయాలతో తిరుగులేని దర్శకుడిగా మారిపోయారు. ఎఫ్2 చిత్రం 75 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి టాలీవుడ్ స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.


Click it and Unblock the Notifications











