అదే రాజమౌళి సక్సెస్ సీక్రెట్.. బయటపెట్టిన సరిలేరు దర్శకుడు
అపజయాన్ని చూడని దర్శకుడిగా దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తీసిన ప్రతీ సినిమా దానికదే రికార్డులను బద్దలుకొట్టుకోవడం పరిపాటైంది. ఇప్పటి వరకు ఆయన తీసిన 11 సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్‌లున్నాయి. తెలుగు సినిమాలను తెరకెక్కిస్తూనే ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి పెద్ద స్టార్లైనాఆయన సినిమాల్లో ఎలాంటి పాత్రైనా చేసేందుకు రెడీగా ఉంటారు.

జక్కన్న సక్సెస్ ఫార్మూలా..
టాలీవుడ్ జక్కన్న సక్సెస్ ఫార్మాలాను ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. సన్నివేశాలను తీసే విధానంలోనూ, ఎమోషన్‌ను పండించే విధానంలోనూ రాజమౌళి తీరే ప్రత్యేకం. టాలీవుడ్‌లో మహా మహా దర్శకులే గడ్డుకాలాన్ని చూశారు. కానీ రాజమౌళి మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాజమౌళి విజయ రహస్యాన్ని మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు.

సక్సెస్‌తోనే సావాసం చేస్తోన్న దర్శకులు..
ఇలా రాజమౌళి బాటలోనే నడుస్తూ ఇంత వరకు సక్సెస్‌తోనే సావాసం చేస్తూ వస్తున్నారు కొందరు దర్శకులు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొరటాల శివ. ఇప్పటి వరకు తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, భరత్ అనే నేను చిత్రాలు ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ కోవలోకి చెందిన మరో దర్శకుడు అనిల్ రావిపూడి. మీడియం రేంజ్ సినిమాలు తీసినా.. వాటినీ సూపర్ హిట్ చిత్రాలుగా మలిచే సత్తా ఉన్నోడు. కెరీర్ డౌన్‌లో హీరోలకు మంచి విజయాలను అందించి గాడిలో పెడుతూ ఉంటాడు.

సీక్రెట్‌ను కనిపెట్టిన అనిల్ రావిపూడి..
రాజమౌళి తీసిన సినిమాల్లో ఏ ఒక్కటి మిస్ కాకుండా అన్ని ఎలా హిట్ కొడుతున్నారు? అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన తన బలాన్ని ఎప్పుడూ వదిలిపెట్టి సినిమా చేయలేదని తెలిపాడు. ఆయన బలం ‘ఎమోషన్' అని పేర్కొన్నాడు. దాని చుట్టూనే ఆయన సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Recommended Video

ఏ చిత్రమైనా అదే ముఖ్యం..
‘ఈగ' అయినా ‘బాహుబలి' లాంటి ఫాంటసీ అయినా.. ఆయన తన బలమైన ఎమోషన్ ను మిస్ కాకుండా చూసుకున్నాడు. అందుకే ఎప్పుడూ సక్సెస్ ఆయన వెంటే వస్తుంది. అందుకే.. మన బలాన్ని ఎప్పుడూ వదలకూడదు. అప్పుడు సినిమా మిస్ ఫైర్ అయ్యే అవకాశం తక్కువ.. అందుకే కథ రాసుకునే దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తన సినిమాలు వరుస పెట్టి సక్సెస్ అవుతున్నాయంటూ ఈ దర్శకుడు జక్కన్న సీక్రెట్ బయటపెట్టేశాడు.


Click it and Unblock the Notifications











