'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ జడ్జ్ ఆయనే.. చాలా ఇబ్బంది పెట్టా.. సీక్రెట్స్ చెప్పేసిన అనిల్ రావిపూడి
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుమీదున్నాయి. ఇందులో భాగంగా విశాఖ ఉత్సవ్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పీచ్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై ఉన్న హైప్ అంతకంతకూ పెంచేసింది. వివరాల్లోకి పోతే..

లాస్ట్ ఇయర్ ఇదే సమయం.. మళ్ళీ ఇప్పుడు
వేదికపై మాట్లాడిన అనిల్ రావిపూడి మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించే చెప్పారు. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఎఫ్ 2 సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి వచ్చి సక్సెస్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం వచ్చాము. ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్ దేవి శ్రీ ప్రసాద్. ఆయనిచ్చిన ఫీడ్ బ్యాక్ నేనెప్పుడూ మరువలేను. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు అనిల్ రావిపూడి.

చూసింది కొంచమే ఇంకా ఇరగదీశారు
ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు ఆంథెమ్ కోసం దేవి శ్రీ ప్రాణం పెట్టారు. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ కోసం సూపర్ సాంగ్ ఇచ్చారు. మీరు చూసింది కొంచమే ఇంకా ఇరగదీశారు అని చెప్పారు అనిల్ రావిపూడి.

మహేష్ బాబుకు గిఫ్ట్ ఇస్తా..
సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. ఆయనతో చేసిన ఈ జర్నీ మరిచిపోలేనిది. ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టార్. ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన జెన్యూన్ పర్సన్. ఆయనకు ఈ సినిమా రూపంలో మంచి సక్సెస్ ఇచ్చి, అలాగే గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా అని అనిల్ చెప్పుకొచ్చారు.

సినిమా ఆరంభం నుంచి చివరిదాకా రాజేంద్ర ప్రసాద్..
రేపు మీరు జనవరి 11 చూడబోతున్నారు. మహేష్ చేసిన కామెడీ, ఎమోషన్స్ చూసి చాలా ఎక్సయిట్ అవుతారు. మహేష్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చారు. ఇక వెటరన్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చాలా ముఖ్యమైన పాత్ర చేశారని, మహేష్ బాబు- రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా ఆరంభం నుంచి చివరిదాకా ఆద్యంతం అలరిస్తాయని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్‌ని చాలా ఇబ్బంది పెట్టానని చెప్పారు.

డెఫినెట్‌గా అదే జరుగుతుంది
విజయశాంతి ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. అలాగే ప్రకాష్ రాజ్, సంగీత ఇలా అన్ని పాత్రలు మిమ్మల్ని అలరించబోతున్నాయి. డెఫినెట్‌గా గతేడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు అనిల్ రావిపూడి.


Click it and Unblock the Notifications











