ముగ్గురు హీరోలు, మూడు నెలల టార్గెట్.. పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ చేసుకున్న కామెడీ డైరెక్టర్!

సినిమా షూటింగ్స్ ప్లాన్ ప్రకారం కొనసాగిస్తే అనుకున్న సమయం కంటే చాలా వేగంగా పూర్తి చేయవచ్చని నీరూపించే దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. స్క్రిప్ట్ రాసుకున్నపుడే అనిల్ ఏ సీన్ కి ఎంత సమయం పడుతుంది అనే విషయంలో కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తాడట. అందుకే మళ్ళీ ఎడిటింగ్ లో లేపేసే పని ఉండదట. అంత బాగా ప్లాన్ రెడీ చేసుకునే అనిల్ నెక్స్ట్ ముగ్గురు హీరోలతో మూడు నెలల్లో ఒక సినిమాను పూర్తి చేయాలని పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న అనిల్ పెద్ద హీరోలతో కూడా మంచి కమర్షియల్ సినిమాలను తీయగలడని రుజువు చేసుకున్నాడు. ఇక అలాంటి దర్శకుడితో మల్టీస్టారర్ అంటే ఎవరైనా సరే ఈజీగా ఒప్పేసుకుంటారు. F2 సినిమా తరహాలోనే F3 అనే సినిమా చేస్తున్న అనిల్ ఈ సారి ముగ్గురు హీరోలను దించనున్నాడు.

Anil ravipudi perfect plan for f3 movie shooting schedule

వరుణ్ తేజ్, వెంకటేష్, తమన్నా, మెహ్రీన్ వారి పాత్రల్లో ఎలాంటి మార్పు ఉండదట. కానీ కథలోకి మరో హీరో హీరోయిన్ ని తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను ఈ ఏడాది ఏండింగ్ లో మొదలు పెట్టి కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారట. సమ్మర్ లో థియేటర్లు ముందు రోజుల్లా రద్దీగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడే F3ని విడుదల చేయాలని దిల్ రాజుతో చర్చలు జరిపినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X