రాములమ్మా మజాకా.. ఎగిరితంతే అవతల పడిపోయిన నటుడు
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తరువాత స్క్రీన్‌పై కనిపించింది. అప్పట్లో లేడీ ఓరియెంటెడ్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విజయశాంతి.. రాజకీయాల్లో అడుగుపెట్టడంతో సినీ రంగానికి దూరమైంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంది. లెక్చరర్ భారతి పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చి సత్తా చాటింది. సరిలేరు చేసిన ఆ పవర్‌ఫుల్ రోల్‌కు రాములమ్మ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఈ మూవీ షూటింగ్ సెట్‌లో అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారని ప్రమోషన్లలో చెప్పిన యూనిట్.. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. సరిలేరు సెట్‌లో రాములమ్మ చేసిన ఫీట్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఫుల్ ఫిట్‌నెస్‌తో ఉన్న రాములమ్మ.. బ్రహ్మాజిని కాలితో ఎగిరితన్నింది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్.. సరిలేరు ఒక్క ఫైటింగ్ సీన్ పెట్టి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

సరిలేరు చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మూడో రోజు ముగిసేసరికి 'సరిలేరు నీకెవ్వరు' మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం పట్ల మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ కెరీర్‌లో 100 కోట్ల మార్క్ దాటినా 6వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











