twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరే సినిమాకు పెద్ద బలం.. విజయశాంతికి డైరెక్టర్ స్పెషల్ విషెస్

    |

    లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బర్త్ డే నేడు (జూన్ 24). ఈ సందర్భంగా ఆమె శ్రేయోభిలాషులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరు డైరెక్టర్ సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు ఆమెపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా మహేష్ బాబు సైతం విజయశాంతికి బర్త్ డే విషెస్ తెలిపాడు. సరిలేరు నీకెవ్వరు కలిపిన ఈ బంధం గట్టిగానే ఉందనిపిస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్, హీరో ఏమని ట్వీట్ చేశారో చూద్దాం.

    లేడీ అమితాబ్ బర్త్ డే సందర్భంగా అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు.. మీరు నటించే సినిమాకు మీరే అతి పెద్ద ఆస్తి, బలం. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మీరు అందించిన కృషి మాటల్లో వర్ణించలేను' అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు స్పందిస్తూ.. 'హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. మీరెప్పుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాల'ని కోరుకున్నాడు. వీరి ట్వీట్లకు విజయశాంతి రిప్లై ఇస్తూ ఇరువురికి ధన్యవాదాలు తెలిపింది.

    Anil Ravipudi Special Birthday Wishes To Vijayashanthi

    సరిలేరు సక్సెస్ తరువాత విజయశాంతికి భారీగానే ఆఫర్స్ వచ్చాయట. కానీ విజయశాంతి మాత్రం వేటిని అంగీకరించలేదని తెలుస్తోంది. విజయశాంతి డిమాండ్లు కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో నిర్మాతలు కూడా భయపడుతున్నారని తెలుస్తోంది. అయితే విజయశాంతి వంటి స్టార్‌ను హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు. అయితే ఆ మధ్య లూసిఫర్ రీమేక్‌లో విజయశాంతి నటించబోతోందనే వార్తలు వచ్చాయి కానీ అవి వట్టి రూమర్స్‌గానే మిగిలిపోయాయి.

    English summary
    Anil Ravipudi Special Birthday Wishes To Vijayashanthi. He wished that ou are an asset to any film which you are in. Words cannot do justice to your contribution to our film #SarileruNeekevvaru
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X